ఎడిట్ నోట్: పవన్‌కు బ్రేకులు లేవే..!

-

అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయనే చెప్పొచ్చు…కేంద్రంలో అయినా, ఇటు రాష్ట్రాల్లోనైనా అధికార పార్టీలు అసలు..ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలనే కాన్సెప్ట్‌తో ఉన్నాయి. అయితే అధికార పార్టీలు రాజకీయంతో ప్రతిపక్షానికి చెక్ పెడుతున్నా సరే..ప్రజలే ప్రతిపక్షాలని నిలబెడుతున్నాయి..లేదా కొత్త ప్రతిపక్షాలని తయారు చేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో అధికార టీఆర్ఎస్…కాంగ్రెస్-టీడీపీలని గట్టిగా దెబ్బకొట్టింది. దీంతో బీజేపీ కొత్త ప్రతిపక్షంగా అవతరించింది.

ఏపీలో కూడా పరిస్తితులు మారుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలని అధికారంలో ఉన్న వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది..ఎక్కడకక్కడ రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తుంది. కానీ వైసీపీకు మొత్తం వ్యతిరేకమవుతుంది..అనూహ్యంగా టీడీపీ బలం పెరుగుతుంది. ఇటీవల పవన్‌ని టార్గెట్ చేసి..జనసేన బలం పెంచుతున్నారు. అయితే రాజకీయంగా చంద్రబాబుకు చెక్ పెట్టడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు గాని..పవన్‌కు చెక్ పెట్టే విషయంలో అంతగా సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఆయనకు ఎక్కడక్కడ బ్రేకులు వేయాలని చూసి వైసీపీ ఫెయిల్ అవుతుంది..విశాఖ ఘటన కావచ్చు..ఇప్పటం ఘటన కావచ్చు పవన్‌ని నిలువరించలేకపోతున్నారు. పైగా ఆయనకు జనాదరణ అమాంతం పెరుగుతూ వస్తుంది. అదే సమయంలో పవన్‌తో చంద్రబాబు కలవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. వైసీపీ డేంజర్ జోన్‌లోకి వచ్చేస్తుంది.

ఇక తాజాగా మోదీ ఏపీలో పర్యటనించనున్నారు. ఈ పర్యటనకు పవన్‌ని దూరం చేయాలని వైసీపీ గట్టిగానే ట్రై చేసింది. మోదీని గాని పవన్ కలిస్తే మళ్ళీ రాజకీయం మారిపోతుంది..వైసీపీకి ఇబ్బంది అవుతుంది. అందుకే మోదీ పర్యటన మొత్తం వైసీపీనే చూసుకుంటుంది..బీజేపీ కంటే ఎక్కువగా వైసీపీ కష్టపడుతుంది. మోదీ మెప్పు పొందేందుకు ట్రై చేస్తుంది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న పవన్‌ని మోదీకి దూరంగా ఉంచాలని టార్గెట్ తో ఉన్నారు. ఆ మధ్య అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు పవన్‌కు ఆహ్వానం రానివ్వలేదు.

ఇప్పుడు మోదీ విశాఖ టూరుకు దూరం పెట్టాలని భావించారు..కానీ అనూహ్యంగా పి‌ఎం‌ఓ నుంచి మోదీతో భేటీకి పవన్‌ని ఆహ్వానించారు. కొన్ని గంటల్లోనే మోదీతో పవన్ పర్సనల్‌గా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రమోలో రాజకీయ పరిణామాలు, వైసీపీ అరాచక పాలనను పవన్  ఈ సందర్భంగా ప్రధానికి వివరిస్తారని సమాచారం. అలాగే రాష్ట్ర బీజేపీ నేతలతో వచ్చిన గ్యాప్‌.. ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్‌తో బాబు భేటీ అయ్యారు..ఇప్పుడు మోదీతో పవన్ భేటీ అవుతున్నారు. దీని తర్వాత రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏదేమైనా పవన్‌కు బ్రేకులు వేయడంలో వైసీపీ ఫెయిల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news