టీం ఇండియా ఆటగాళ్ళకు పొగరు ఎక్కువా…?

467

అవును ఒక క్రీడా పండితుడు అవుననే అంటున్నాడు. టీం ఇండియా ఆటగాళ్ళకు పొగరు ఎక్కువ… అంతా ఇంతా కాదు అంటున్నాడు. ఎందుకో కూడా చెప్తున్నాడు అతను. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కూక్ గుర్తున్నాడు కదా మీకు…? అతను అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పుడో ఒకసారి ఫాంలో ఉండే వాడు కాదు. అతను విఫలమవుతున్నట్టు ఎప్పుడో ఒకసారి వార్తలు వచ్చేవి.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ గుర్తుండే ఉంటాడు కదా…? అతను కూడా అంతే. దానికి కారణం ఏంటో తెలుసా…? వాళ్ళు నిత్యం క్రికెట్ ఆడటమే. అవును వాళ్ళు నిత్యం క్రికెట్ ఆడుతూనే ఉండే వాళ్ళు. 365 రోజులు మైదానంలో ఎక్కువగా ఉండే వాళ్ళు. ఇప్పుడు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ సహా చాలా మంది ఆటగాళ్ళు ఇప్పుడు నిత్యం క్రికెట్ ఆడుతూనే ఉన్నారు.

ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్ లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్, దేశ వాళీ లీగ్ మ్యాచ్ లు ఇలా ప్రతీ ఒక్క దాంట్లో వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. దేశవాళి క్రికెట్ కి ప్రాధాన్యత ఇస్తేనే మనం పైకి వస్తామని నమ్ముతారు వాళ్ళు. టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని, సారధిగా ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ కి కుక్ బాధ్యతలు వహించే వాడు. అతను నిత్యం క్రికెట్ ఆడుతుంటే ధోనీ మాత్రం విదేశీ టూర్లకు వెళ్లి షికార్లు చేసి వచ్చాడు.

అందుకే కుక్ చివరి మ్యాచ్ వరకు కూడా బాగా ఆడాడు. ఇప్పుడు ధోనికి బ్యాట్ పట్టుకోవడమే ఇబ్బంది అయింది. జట్టులో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తయారు చేయలేని క్రికెట్ బోర్డ్ ఉన్న భారత్ లో ఉన్న ఆటగాళ్ళను విశ్రాంతి లేకుండా ఆడిస్తూ ఉంటుంది. విశ్రాంతి దొరికితే వీళ్ళు విదేశీ టూర్లకు వెళ్తూ ఉంటారు. ఇరాని ట్రోఫీ, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ ఇలా ఎప్పుడు ఏదోక ట్రోఫీ జరుగుతూనే ఉంటుంది.

కాని మన వాళ్ళు మాత్రం జాతీయ జట్టులో ఆడితే ఏదో గొప్పగా ఫీల్ అయి దేశవాళి మ్యాచ్ ఆడాలి అంటే చాలు ఏదో భారంగా భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది ఆటగాళ్ళు కనుమరుగు అయిపోతు ఉంటారు. కేదార్ జాదావ్, మనీష్ పాండే మినహా ఎవరూ కూడా దేశవాళీ మ్యాచ్ లు ఆడటం లేదు. అప్పుడప్పుడు వ్రుద్దిమాన్ సాహా. అందుకే టీం ఇండియా ఆటగాళ్లకు పోగరు అంటున్నాడు ఒక క్రీడా పండితుడు.