నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. దీనిలో 200 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక పూర్తిగా చూస్తే.. దీనిలో
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనాలు అందించునున్నట్లు చెప్పడం జరిగింది.
ఏఐసీటీఈ నుంచి అప్రూవల్ పొందిన లేదా యూజీసీ గుర్తింపు పొందిన కాలేజీల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు చేసిన వారు సంబందించిన పోస్టులకి అప్లై చెయ్యచ్చు. 60 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితిని 25 ఏళ్లుగా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు
మెకానికల్ ఇంజనీర్ విభాగం లో మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ లేదా మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే సివిల్ ఇంజనీర్ విభాగంలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చెయ్యచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
అలానే ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగం లో కూడా మరో 25 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చెయ్యచ్చు. అభ్యర్థులు రూ. 1180ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు మినహాయింపు కొందరికి వుంది గమనించండి. పూర్తి సమాచారం కోసం ఈ కింద లింక్ లో చూడచ్చు. https://hindustanpetroleum.com/hpcareers/documents/careers_pdf/Advertisement_HPCL_2021_Engineering.pdf