పది ప్యాస్ అయిన వారికి గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా లోని వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌/యూపీహెచ్‌సీ ఆసుపత్రుల్లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాల లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా లోని వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌/యూపీహెచ్‌సీ ఆసుపత్రుల్లో ఈ ఖాళీలు వున్నాయి. పోస్టుల వివరాలని 21 ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఇక అర్హత వివరాలని చూస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. అయితే ఒక్కో పోస్టుకి ఒక్కో అర్హత వుంది. అలానే అనుభవం కూడా ఉండాలి. ఇక ఇదిలా ఉంటే వయస్సు విషయానికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వుంది. నవంబర్‌ 26, 2022వ తేదీలోపు ఈ పోస్టులకి అప్లై చెయ్యాల్సి వుంది. అకడమిక్‌ మెరిట్‌, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తూ వుంటారు.

చిరునామా: Management Unit (DPMU), National Urban Health Mission (Dr. Y.S.R. Urban Health Clinics /UPHC’s), East Godavari District, AP.

 

Read more RELATED
Recommended to you

Latest news