మీరు ఏదైనా ఉద్యోగం పొందాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు పోస్టల్ శాఖ Postal Department గుడ్ న్యూస్ చెబుతోంది. ఈ పోస్టులకి ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే లైఫ్ ఇన్సూరెన్స్, ఇతర పాలసీలను చేయించేందుకు గానూ కమిషన్ ప్రతిపాదికన పోస్టల్ ఏజెంట్లను ఎంపిక చేయనున్నట్లు హైదరాబాద్ సౌత్ డివిజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. మరిన్ని వివరాలని చూస్తే..
.
ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ కావాలని చెప్పారు. ఇక వయస్సు విషయం లోకి వస్తే.. 18 నుంచి 50 ఏండ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు దీనికి అర్హులుగా పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 040 – 23463800 నంబర్‌కు కాల్ చేయొచ్చు.
అభ్యర్థులు జూలై 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టుకి అప్లై చెయ్యాలని అనుకునే వాళ్ళు త్వరగా అప్లై చేసుకోవడం మంచిది. అభ్యర్థుల ఎంపిక ఆగస్టు 12, 13 తేదీల్లో చేపట్టనున్నారు.