విద్యార్థులకు శుభవార్త.. దరఖాస్తుకు మరో అవకాశం

జేఈఈ మెయిన్ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ రాత్రి 9గంటల వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. తొలి విడత జేఈఈ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 21 నుంచి 29 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. రెండో విడత జేఈఈ దరఖాస్తులకు సంభందించి డేట్స్‌ను తర్వాత ప్రకటిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.