నేటి నుంచి హాల్ టికెట్ల డౌన్‌‌లోడ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేటి(మంగళవారం) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో సరిగ్గా లేకపోతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫొటోను అతికించి సంతాకాలు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.