స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకూ గుడ్ న్యూస్. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ముంబైలోని ఎస్‌బీఐ కార్పొరేట్ సెంటర్‌ లో ఏ ఖాళీలు వున్నాయి.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టులని భర్తీ చేస్తోంది. అలానే సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు లోకి వెళితే… దీనిలో మొత్తం 36 ఖాళీలు వున్నాయి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. 31-07-2022 నాటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 32 ఏళ్లు ఉండాలి. అదే మిగిలిన పోస్టులకు అయితే 35 సంవత్సరాలు దాటి వుండకూడదు. వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. అలానే అనుభవం కూడా ఉండాలి అని నోటిఫికేషన్ లో చెప్పారు. ఈ వివరాలని నోటిఫికేషన్ లో చూసి తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 29-12-2022. పూర్తి వివరాలని https://www.sbi.co.in/ లో చూడచ్చు.

పోస్టుల వివరాలు:

డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 06
డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్) -02
సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్)- 10
డిప్యూటీ మేనేజర్(జావా డెవలపర్) – 5
డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్) – 3
సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్)- 1
సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్‌ & ఎస్‌క్యూఎల్‌ డెవలపర్)- 1
సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్)- 3
ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్)- 2
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్- 1

 

 

Read more RELATED
Recommended to you

Latest news