రైల్వేలో భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌.. ఏకంగా 35,000 ఉద్యోగాలు… ఇలా అప్లై చేయండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. రైల్వే శాఖ లో చాలా పోస్టులు వున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వేలో 35,000 ఖాళీలు భర్తీ చేసేందుకు చూస్తోంది. మొత్తం 35,281 పోస్ట్లను ఇండియన్ రైల్వేస్ భర్తీ చేయడానికి చూస్తున్నట్టు చెబుతున్నారు.

మార్చి 2023 చివరి నాటికి అపాయింట్మెంట్ లేటర్లని ఇచ్చేస్తారట. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సెంట్రలైడ్జ్ ఎంప్లాయ్‌ మెంట్ నోటీస్ 2019 ఆధారంగా.. మార్చి 2023 నాటికి 35,281 పోస్టుల భర్తీ చేస్తున్నట్టు చెప్పారు.

అయితే ఈ పోస్టులు అన్నింటికీ కలిపి ఒక పరీక్షే వుంటుందట. ఒకే ఫలితం ప్రకటించడం వల్ల కొంత మంది వివిధ ఉద్యోగాలకి ఎంపికైనా ఒక్కటే జాబ్ ని సెలెక్ట్ చేసుకోవాలట. కనుక మిగతా ఉద్యోగాలు మళ్లీ ఖాళీగానే వుంటాయని చెప్పారు. ఇలా చేస్తే మిగిలిన అభ్యర్థులు కూడా జాబ్ ని పొందే అవకాశం ఉంటుంది అని అన్నారు. 2023 మార్చి నాటికి 32,281 ఉద్యోగాలను తప్పక భర్తీ చేస్తారట. వేరు వేరుగా ఫలితాలను ప్రకటించడం వల్ల ఏ విధమైన సమస్యా కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news