కామర్స్, సీఏ స్టూడెంట్స్‌కు శుభవార్త..!

-

ప్రముఖ అకౌంటింగ్ అండ్​ ఫైనాన్షియల్ ​సంస్థ ప్రైజ్​ వాటర్​ హౌజ్​ కూపర్ కామర్స్, ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. పీడబ్ల్యూసీ కోల్‌కతా కార్యాలయంలో సీనియర్ అసోసియేట్ ఇన్​- కార్పొరేట్ ఫైనాన్స్ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

jobs
jobs

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ప్లాబ్లం సాల్వింగ్​ టీమ్​లో వర్క్ చెయ్యాల్సి ఉంటుంది. సరికొత్త వ్యూహ్యాల ద్వారా వ్యాపార సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు హెల్ప్ చెయ్యాల్సి ఉంటుంది. అధికారిక వెబ్​సైట్​ www.pwc.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.

ఇక అర్హత గురించి చూస్తే.. అభ్యర్థులు సీఏ/ సీఏ -ఇంటర్/ సీఎఫ్​ఏ/ ఎంబీఏ పూర్తి చెయ్యాలి. లేదు అంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అని నోటిఫికేషన్ లో వుంది. అదే విధంగా సంబంధిత విభాగంలో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పని సరి. కొన్ని నైపుణ్యాలు కూడా ఉండాలి.

వాటి వివరాలలోకి వెళితే.. క్లయింట్ అభ్యర్థనలను విశ్లేషించి, అంచనా వేయగల సామర్థ్యం ఉండాలి. నాణ్యత, ఉత్పాదకతను పెంచే కొత్త పరిశోధన విధానాలను రూపొందించే సామర్థ్యం, డేటాబేస్‌లపై మంచి అవగాహన కూడా ఉండాలి. అలానే ఎంఎస్​ ఆఫీస్​ టూల్స్‌పై వర్కింగ్​ నాలెడ్జ్ ఉండాలి. రిటన్​ కమ్యూనికేషన్ స్కిల్స్​, ప్రాజెక్ట్ అండ్​ టైమ్​ మేనేజ్​మెంట్​ స్కిల్స్​, మల్టీ టాస్క్ వంటివి ఉండాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మీ అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

Read more RELATED
Recommended to you

Latest news