పరీక్ష లేకుండానే రైల్వే లో ఉద్యోగాలు… వివరాలు ఇవే..!

మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్ వీల్ ఫ్యాక్టరీ ట్రేడ్ అప్రెంటీస్ (Rail Wheel Factory Apprentice Recruitment 2021) ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దీనిలో మొత్తం 192 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

Indian Railway Job recruitment

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుండి నేషనల్ ట్రేడ్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కూడా తప్పక ఉండాలి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 13 సెప్టెంబర్ 2021. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు rwf.indianrailways.gov.in లో రైల్వే వీల్ ఫ్యాక్టరీ వెబ్‌సైట్‌ను చూసి పూర్తి వివరాలని తెలుసుకొచ్చు.

వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నత వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది. రైల్ వీల్ ఫ్యాక్టరీ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 10 వ తరగతిలో సాధించిన మార్కులు , ITI లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 13 తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణించబడవు. కనుక ముందే పంపాలి.

చిరునామా: ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు -560064