‘జోసా’ షెడ్యూల్ విడుదల

-

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) షెడ్యూల్‌ను ఐఐటీ రూర్కీ ప్రకటించింది.

దీని ప్రకారం.. జూన్ 16 ఉదయం పది నుంచి అభ్యర్థులు రిజిస్ట్రేషన్,చాయిస్ ఫిల్టింగ్ చేసుకోవచ్చు. ఏఏటీ వారికి జూన్ 21న చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 22న మాక్ సీట్ అలకేషన్-1ని ప్రకటిస్తారు, జూన్ 24న రెండో మాక్ సీట్ అలకేషన్ ప్రకటిస్తారు. జూన్ 25 అభ్యర్థుల చాయిస్ ఫిల్లంగ్‌కు చివరితేదీ. అతర్వాత జోసా రౌండ్ 1 సీటు అలాట్‌మెంట్ ప్రక్రియ జూన్ 27న ప్రారంభమవుతుంది. ఇలా జోసా ఏడు రౌండ్లు తర్వాత సీఏఎస్‌బీ అలాట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది.జూలై 23ఈ ప్రక్రియ పూర్తికానుంది. పూర్తి వివరాల కోసం https://josaa.nic.in చూడవచ్చు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news