ప్రముఖ ఐటీ కంపెనీల్లో నాన్​ టెక్నికల్ జాబ్స్… వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశవిదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీలు కేవలం టెక్నాలజీ సంబంధింత ఉద్యోగాలే కాదు నాన్​ టెక్​ ఉద్యోగాలను కూడా ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ టాప్​ ఎమ్​ఎన్​సీ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నాయి. పూర్తి వివరాలలోకి వెళితే..

 

jobs
jobs

నీల్సన్ గ్లోబల్ మీడియా బెంగళూరు:

ట్రైనీ అనలిస్ట్ పోస్టులని నీల్సన్ గ్లోబల్ మీడియా బెంగళూరు కార్యాలయంలో భర్తీ చేస్తున్నారు. బ్యాచిలర్​​ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు అర్హులు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ తప్పక ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి.

సీనియర్ ఐటీ రిక్రూటర్, రివాగో ఇన్ఫోటెక్, అమృత్‌సర్ :

సీనియర్ ఐటీ రిక్రూటర్ భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది కంపెనీ. ఎంపికైన అభ్యర్థులు నైట్​ షిఫ్ట్​లో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థికి తప్పనిసరిగా రెండేళ్ల పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అనుభవం ఉండాలి.

డేటా అనలిస్ట్, కెరీర్‌స్కూల్ హెచ్​ఆర్​ సొల్యూషన్ హైదరాబాద్:

ఇది ఫుల్​టైమ్​ డేటా అనలిస్ట్ (నాన్ ఐటీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు. ఎంపికైన వారికి రూ. 14,000 నుంచి రూ. 16,000 నెలవారీ వేతనం లభిస్తుంది. అదనంగా పీఎఫ్, ఈఎస్ఐని కూడా లభిస్తాయి.

ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్- వాయిస్, కాగ్నిజెంట్, హైదరాబాద్ :

బి.టెక్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా సంస్థ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కస్టమర్ సపోర్ట్ (వాయిస్) ప్రాసెస్​ పోస్టులని భర్తీ చేస్తోంది అప్లై చేసుకోచ్చు.

యూఎస్​ ఐటీ రిక్రూటర్, జెన్​క్యూమ్​ టెక్నాలజీస్:

జెన్క్యూమ్ టెక్నాలజీస్ యూఎస్​ ఐటీ రిక్రూటర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 0.6 నుంచి 2 సంవత్సరాల అనుభవంతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోచ్చు.

బిజినెస్ డెవలప్‌మెంట్ పార్టనర్, అహ్మదాబాద్:

బెస్ట్​ డాక్​ టెక్నాలజీ ప్రైవేట్​ లిమిటెడ్ సంస్థకు చెందిన బిజినెస్ డెవలప్‌మెంట్ పార్టనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news