స్టేట్ బ్యాంక్ నోటిఫికేషన్… 1,673 పీఓ పోస్టులు.. పూర్తి వివరాలివే..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల లోకి వెళితే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ మేరకు 1,673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది స్టేట్ బ్యాంక్.

ఈరోజే అప్లికేషన్ ప్రాసెస్ మొదలు అయ్యింది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 22. ఇక ఖాళీల వివరాలను చూస్తే.. రెగ్యులర్ ఖాళీలు 1600 పోస్టులు ఉండగా బ్యాక్‌లాగ్ ఖాళీలు 73 పోస్టులు వున్నాయి. అర్హత వివరాలను చూస్తే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగం లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

లేకపోతే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమాన అర్హత కలిగి ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ సమయంలో డిక్లేర్డ్‌లో గ్రాడ్యుయేషన్ పరీక్షలో ప్యాస్ అయ్యినట్టు చూపించాలి. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడచ్చు. అలానే అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు సవరణ, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ: అక్టోబర్ 12, 2022
దరఖాస్తు రుసుమును చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబర్ 12, 2022
ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: డిసెంబరు 2022 మొదటి వారం లేదా రెండవ వారం.