పరీక్షలు దగ్గరపడ్డాయా..? ఎక్కువసేపు చదవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యాల్సిందే…!

-

పరీక్షలు దగ్గర పడ్డాయి అంటే పిల్లల్లో టెన్షన్ మొదలవుతుంది. నిజానికి ప్రిపరేషన్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. టైం మేనేజ్మెంట్ ని కూడా ఫాలో అవ్వాలి. నిజానికి పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ఎక్కువ సేపు చదవాలి. ఈ మధ్యకాలంలో పుస్తకాల కంటే ఆన్లైన్ క్లాసులు మెటీరియల్స్ వంటివి ఎక్కువైపోయాయి.

దీంతో పిల్లలకి ఒత్తిడి కూడా కలుగుతోంది. పైగా కళ్లపై కూడా అది ఎఫెక్ట్ చేస్తోంది. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. రాత్రిపూట త్వరగా నిద్ర పోవడం, ఎక్కువ సేపు నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం.

దీని వల్ల మెదడు బాగా పని చేస్తుంది అయితే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు పొందాలన్నా… బాగా కష్టపడి ఎక్కువ సేపు చదవాలన్న చదివేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవడం మంచిది. వీటిని కనుక విద్యార్థులు ఫాలో అయ్యారంటే బాగా చదువుకోడానికి అవుతుంది. అలాగే బాగా స్కోర్ కూడా చెయ్యచ్చు. మరి ఇక ఆ టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

విద్యార్థులు చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి మధ్య 25 సెంటి మీటర్ల దూరం పాటించాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ కి ఎఫెక్ట్ అవ్వదు. ఎక్కువసేపు చదువుకోడానికి అవుతుంది.
కళ్ళు కనుక మండుతున్న లేదంటే కళ్లపై ఎఫెక్ట్ పడిన వాటిని రుద్దకూడదు. చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
అలానే చాలా మంది గంటలకొద్దీ చదువుతూ ఉంటారు అలా కాకుండా పది నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల చదవడానికి బాగుంటుంది.
ఎక్కువ సేపు చదువుకోవాలంటే మంచి వెలుతురు ఉండే గదిలో చదవడం మంచిది.
చాలా మంది ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చదువుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కళ్ళు అలసిపోతాయి.
అలానే చదువుకునేటప్పుడు చిన్న చిన్న టెక్నీక్స్ ని ఫాలో అవడం మంచిది. మీరు చిన్న చిన్న ట్రిక్స్ ని పెట్టుకుని చదివితే బాగా గుర్తుంటాయి.
కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని చదివితే కూడా బాగా గుర్తుంటాయి.
అదే విధంగా మీరు చదువుకునేటప్పుడు ఎక్కువ వెయిటేజ్ వున్న వాటిని ముందు పూర్తి చేసుకోండి దీనితో స్కోర్ చేయడానికి ఈజీ అవుతుంది.
కష్టమైన టాపిక్స్ ఉన్నట్లయితే సమయాన్ని వృధా చేయకండి.
అలానే తక్కువ వెయిటేజ్ వున్న చాప్టర్స్ ని కూడా ఎక్కువసేపు చదువుకోకండి ముందు వెయిట్ ఎక్కువ ఉన్న వాటిని కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగిలిన వాటిని చదువుకోవడం మంచిది. ఇలా విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ టెక్నిక్స్ ని ఫాలో అయితే బాగా మార్కులు స్కోర్ చేయడానికి అవుతుంది పైగా ఈజీగా ప్రిపేర్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news