నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌ గురుకులాల్లో ఖాళీలు..!

-

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌ గురుకులానికి చెందిన అశోక్‌ నగర్‌ (వరంగల్‌ రూరల్‌), రుక్మాపూర్‌ (కరీంగనగర్‌) లోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ మెన్, ఉమెన్‌ (టీటీడబ్ల్యూఆర్‌ఏఎఫ్‌పీడీసీ) లో ఖాళీలు వున్నాయి. ఇక పూర్తి వివరాలని చూస్తే..

టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌/ TTWREIS
టీటీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌/ TTWREIS

దీనిలో మొత్తం 46 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్సెస్, హిందీ తదితర సబ్జెక్టులను చెప్పే టీచర్స్ కావాలని నోటిఫికేషన్ లో తెలిపారు.

అదే విధంగా కంప్యూటర్‌ టీచర్‌ పోస్టులు కూడా వున్నాయి. దీని కోసం ఎంసీఏ/బీటెక్‌ (కంప్యూటర్స్‌) ఉత్తీర్ణులవ్వాలని పేర్కొన్నారు. అలానే కౌన్సిలర్‌ పోస్టులకు అయితే సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలని తెలిపారు.

పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. అలానే టెట్‌ అర్హత సాధించి ఉండాలని తెలిపారు. అలానే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో జూలైలో 5 చివరి గడువుగా పేర్కొన్నారు. వివరాలకు https://tswreis.in/ సందర్శించాలని కోరారు. ఇక శాలరీ విషయం లోకి వస్తే.. టీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.30,000, పీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.40,000, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్‌ పోస్టులకు నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news