ఏపీలో మూడు రాజధానుల వివాదం కొనసాగుతుంది..ఒక వైపు అమరావతి రాజధాని కొసం రైతులు, మహిళుల ఆందోళన చేస్తున్నారు..మరో వైపు మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు నేటి నుంచి రోజువారీ విచారణ జరపనుంది..ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరావతి గ్రామాల రైతులు, విపక్ష పార్టీలు పిటిషన్‌లు దాఖలు చేశాయి. దీంతో అన్ని వివరాలతో విచారణకు రావాలని ఇప్పటికే ఏజీని ఆదేశించింది ధర్మాసనం.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..ఆ బిల్లులపై అనేక వివాదాలు, అమరావతి రైతుల ఆందోళనలు చేస్తుంటే మరోవైపు ఆ బిల్లులను గవర్నర్ కూడా ఆమోదించారు..అయితే గవర్నర్ ఆమోదించిన బిల్లులు రాజ్యాంగ బద్ధంగా లేవంటూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి..పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మూడు రాజధానులపై స్టేటస్‌కో విధించింది.. దాఖలైన పిటిషన్ల సంఖ్య, వాటి తీవ్రత ఆధారంగా రోజువారీ విచారణ జరిపేందుకు గత నెలలోనే అంగీకారం తెలిపింది..ఇవాళ్టి నుంచి విచారణ ప్రారంభం కానుంది.
దీంతో అన్ని వివరాలతో విచారణకు రావాలని పిటిషనర్లతో పాటు ప్రతివాదులుకు ఇప్పటికే ఆదేశించింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు రాజధానుల ఏర్పాటుకు తాను అనుకూలమని ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఐతే విపక్షాలు మాత్రం తాము కొత్త రాజధానులకు వ్యతిరేకమంటూ అఫిడవిట్లు దాఖలు చేశాయి. విపక్షాలన్నీ రైతులకు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం చివరికి ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.