హైదరాబాద్‌లో వరదలపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే గ్రేటర్‌లో ఇలాంటి ఉపద్రవం ఏర్పడిందన్నారు..తక్షణం రక్షణ ఏర్పాటు చేయడంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని…రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ ఏర్పాటు చేసి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..మనకు సముద్రం లేకున్నా విపత్తులు వస్తాయని ప్రభుత్వాలకు ముందస్తు చర్యలు తప్పకుండా ఉండాలన్నారు..నాలలలో పూడిక కూడా తీయకుండా వ్యర్థాలను తొలగిచకుండా వరదలు ఎలా ఆపగలుగుతామని ప్రశ్నించారు..హైదరాబాద్ నుంచి అత్యధిక ఆదాయం అవస్తున్న..
సౌకర్యాలు మాత్రం ఏమి లేవనన్నారు..65 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్తుంది..అది కేవలం సుందరికరణకే కాకుండా..మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు..6 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా..గత ప్రభుత్వాల వల్లనే వరదలు వచ్చాయని నిందలు వేస్తున్నారని ఇది అబద్ధం అని శశిధర్ రెడ్డి అన్నారు..టిఆర్ఎస్, బీజేపీలు వచ్చే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయని ఆదరబాధర చేస్తుంది. కానీ ఇవి ప్రజలకు మేలు జరగదన్నారు శశిధర్ రెడ్డి.