ప్రపంచ వ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న రియాల్టీ షో ల్లో అత్యంత ప్రజాధారణ కలిగిన రియాల్టీ షో ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా బిగ్‌బాస్ రియాల్టీ షో అని సమాధానం వస్తుంది. అందుకు నిదర్శనం తెలుగులో ప్రముఖ స్టార్ మా టీవీల ఛానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ 3 నిలుస్తుంది. కేవలం 17మంది పాల్గొన్న ఈ రియాల్టీ షోకు దాదాపుగా 8.5కోట్ల మంది ఓట్లు వేశారంటే ఈ రియాల్టీ షోకు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అలాంటి రియాల్టీ షో 105 రోజులు దిగ్విజయంగా ముగించుకుని గ్రాండ్ ఫినాలేను గ్రాండ్‌గా ఈనెల 3న నిర్వహించింది.
ఈ రియాల్టీ షో గ్రాండ్ ఫినాలే మెగాస్టార్ చిరంజీవి రాకతో ముగింపు పలకగా, ఈ ఫైనల్‌లో ఐదుగురు పోటీదారులు బిగ్‌బాస్ 3 సీజన్ ట్రోపీ కోసం హోరాహోరి పోరాటం చేశారు. అయితే చివరికి ప్రముఖ పాప్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ను వరించింది. ఇక రన్నరర్‌గా ప్రముఖ నటీ, యాంకర్ శ్రీముఖీ నిలిచింది. ఇక మిగిలిన ముగ్గురులో ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, నటుడు వరుణ్ సందేశ్, అలీ రేజా ఎలిమినేషన్ అయ్యారు.
అయితే ఎలిమినేషన్ అయిన ఈ ముగ్గురిలో బాబా భాస్కర్ చివరి ముగ్గురులో ఒకరిగా నిలువగా, వరుణ్ సందేశ్ నాలుగో స్థానంలో, చివరి స్థానంలో అలీ రెజా ఉన్నారు. అయితే అలీ రేజా అంత అదృష్టవంతుడు ఈ బిగ్‌బాస్ 3 సీజనలో ఎవ్వరు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే అలీ రెజా బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ ముందుగానే అయ్యాడు. కానీ బిగ్‌బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో తన శైలీతో ఎందరినో ఇబ్బందులకు గురిచేసిన అలీ రెజా చివరికి అందరి మదిని దోచుకున్నారు.
టైటిల్ రేసులో ఏనాడు లేని అలీ చివరికి దాకా రావడం అనేది విశేషమనే చెప్పవచ్చు. అసలు ఏనాడు పోటీలో లేని అలీ రెజా అదృష్టంతోనే చివరి స్టేజ్‌కు రావడం అంటే అది అలీకి దక్కిన జాక్‌పాటే. బిగ్‌బాస్‌లో తన తోటి పోటీదారులతో కొన్ని సందర్భాల్లో వివాదస్పదంగా వ్యవహరించి బిగ్‌బాస్ చేత అగ్రహానికి గురయ్యారు. అయితే అన్నింటిని అధిగమించి గ్రాండ్ ఫినాలేకు రావడంతో అలీ రెజా తన సత్తాను చాటుకున్నారు.
అయితే అలీ రెజా వెండి తెర నటుడిగా తన కేరిర్‌ను ప్రారంభించి సిని పరిశ్రమలో అనేక అవకాశాలు సంపాదించుకుంటున్నారు. తనకంటూ మారెడ్‌పల్లిలో రెస్టారెంట్ వ్యాపారం ఉన్న అలీ రెజా నటుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి వెండితెరపై కన్న బుల్లితెరపైనే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నారు అలీ రెజా. ముందుగా బాలీవుడ్‌లో 2008లో ముఖ్‌భీర్ అనే సినిమాతో తెరంగ్రేటం చేశారు.
ఆ తరువాత 2010లో పసుపుకుంకుమ సీరియల్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపై తన సత్తాను చాటారు. వరుసగా ఎవ్వరో నీవు మోహిని, మాటే మంత్రం సీరియల్ నటించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన దృవ సినిమాలోను నటించి మెప్పించారు. చందమామ, గాయకుడు, సినిమహల్, రామ్ ఎన్ ఆర్ ఐ, నా రూటే సపరేట్, నవాబ్ (హింది) సినిమాల్లో నటించారు. బిగ్ బాస్ 3లో గ్రాండ్ ఫినాలే గా దాకా వచ్చి చివరి దశలో టైటిల్‌కు దూరమయ్యారు అలీ రెజా.