రాహుల్ – పున్నూ ప్రేమాయణం మళ్ళీ మొదలు…

-

బిగ్‌బాస్ సీజన్-3లో లవ్ బర్డ్స్ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్-పునర్నవి జోడీనే. వీరు హౌస్ లో ఉన్నంత కాలం, వీరి మధ్య ప్రేమాయణం బాగా హైలైట్ అయింది. అప్పటికప్పుడు తిట్టుకోవడం, వెంటనే కలిసిపోవడం, చిలిపి గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకోవడం..ఇలా వీరి మధ్య అన్ని జరిగాయి. ఇక పునర్నవి ఎలిమినేట్ కావడంతో రాహుల్…గేమ్ మీద దృష్టి పెట్టి టాప్-5కి చేరుకున్నాడు. అదృష్టం బాగుంటే విన్నర్ కూడా అయ్యే అవకాశముంది.

అయితే ఫీనాలే ఎపిసోడ్లలో భాగంగా శుక్రవారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిపోయిన సభ్యులందరూ మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. వరుసగా రవికృష్ణ, జాఫర్, రోహిణి, అషు, తమన్నా సింహాద్రి, వితికా, పునర్నవి, శివజ్యోతి, మహేశ్, శిల్పా చక్రవర్తి, హేమ, హిమజలు బిగ్ బాస్ ఇంటిలోకి వచ్చారు. ఇక రావడం రావడమే ఎవరి బ్యాచ్ వాళ్ళు ముచ్చట్లు పెట్టేసుకున్నారు.

ఇక వీరందరూ ఒక ఎత్తు అయితే రాహుల్-పున్నూ జంటగా గార్డెన్ ఏరియాలో ముచ్చట్లు పెట్టుకున్నారు.
బయట ఏమంటున్నారు అంటూ రాహుల్ అడుగగా….నీకు కొత్త ఫ్రెండ్స్ పరిచయమయ్యారుగా, నేను ఏం చెప్పిన ఫేక్ గానే ఉంటుందని పున్నూ మాట్లాడింది. అదేం లేదంటూ రాహుల్ ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు.

ఈ మధ్య ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావని పున్నూ అంది. నీతో తిరిగి అలా వచ్చి ఉంటుందని రాహుల్ సెటైర్ వేయగా, అలా అయితే కొంచెం సెన్స్ కూడా వస్తే బాగుండు అని పున్నూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి వీళ్ళు గిల్లికజ్జాలు ఆడుకుంటూనే పాత రోజులని మళ్ళీ గుర్తు చేసుకున్నారు. మరి చూడాలి వీరి ప్రేమాయణం బిగ్ బాస్ వరకే పరిమితమవుతుందో…బయట కూడా కంటిన్యూ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news