Independence Day 2023: దేశభక్తిని నింపే టాప్‌ 5 Web Series ఇవే..

-

ముందుగా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. ఇండియా ఈరోజు 77వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటోంది. మువ్వెన్నల జెండా రెపరెపలాడుతూ స్వేచ్ఛగా ఎగురుతుంది. దేశభక్తి కేవలం ఒక కులానికో, ఒక మతానికి పరిమితం కాదు. భారత్‌లో పుట్టిన ప్రతి వ్యక్తికి మన దేశంపై గౌరవం, భక్తి ఉండాలి. స్వాతంత్ర్యం కోసం మనవాళ్లు చేసిన కృషిని తెలుసుకోని తీరాలి. అలా తెలుసుకోవాలి అనే.. పుస్తకాల నుంచి సినిమాల వరకూ దేశభక్తి నింపే కథలు ఎన్నో ఉన్నాయి. దేశభక్తిని నింపే టాప్‌ వెబ్‌ సిరీస్‌ కొన్ని ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే రోజు వీటిలో ఏదో ఒకటి చూసేయండి.!

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1, 2

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్లు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించిన సిరీస్ ఇది. చాలామంది ఇది చూసే ఉంటారు. ప్రతి ఎపిసోడ్‌ ఇంట్రస్టింగ్‌గా అంతే ఫన్నీగా ఉంటుంది. రెండో సీజన్లో సమంత కూడా నటించింది. ఒకటి కశ్మీర్ ఉగ్రవాదంపై కాగా.. మరో సీజన్ శ్రీలంక తమిళుల రివేంజ్ చుట్టూ తిరిగే కథ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఏజెంట్‌గా మనోజ్ కనిపించాడు.

రాకెట్ బాయ్స్ సీజన్ 1, 2

సోనీలివ్ ఓటీటీలో ఉన్న ఈ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్ స్వతంత్ర భారతదేశంలో రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిన తీరును, దేశం జరిపిన తొలి అణు పరీక్ష ఆధారంగా తెరకెక్కింది. దేశం గర్వించదగిన శాస్త్రవేత్తలు హోమీ జే బాబా, విక్రమ్ సారాభాయ్ లపై చిత్రీకరించిన రాకెట్ బాయ్స్ రెండు సీజన్లుగా వచ్చింది. బ్రిటీష్ పాలన నుంచి బయటపడిన తర్వాత మన దేశం అంతరిక్ష, అణు రంగాల్లో సాధించిన ప్రగతిని కళ్లకు కట్టినట్లు ఈ సిరీస్‌లో చూపించారు.

స్పెషల్ ఓపీఎస్, ఓపీఎస్ 1.5

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉన్న వెబ్ సిరీస్ ఇవి. 2001లో పార్లమెంట్‌పై జరిగిన దాడి, ఆ దాడిలో కీలకపాత్ర పోషించిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు హిమ్మత్ సింగ్ (కేకే మేనన్), అతని టీమ్ సాగించే ప్రమాదకర ప్రయాణమే ఈ సిరీస్ సారాంశం. ఎంతో గ్రిప్పింగ్‌గా, ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది.

ముంబై డైరీస్ 26/11

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ ముంబై డైరీస్ సిరీస్ 2008, నవంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు సాగించిన మారణహోమం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆ దాడుల సమయంలో అక్కడి స్థానిక హాస్పిటల్స్ లోని డాక్టర్లు ఎలాంటి భయానక అనుభవాలను ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు.

ది ఫర్‌గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియే

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ది ఫర్‌గాటెన్ ఆర్మీ వెబ్ సిరీస్ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ పై రూపొందించిన సిరీస్. దేశ స్వాత్రంత్ర్యం కోసం పురుషులు, మహిళలతో కూడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎలాంటి యుద్ధం చేసింది? ఎన్ని అవాంతరాలను ఎదుర్కొందో ఈ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news