స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్: దేశ భక్తి చాటుకున్న కళాకారుడు..వైరల్..

-

భారత దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో మనం బానిసలుగా బ్రతికారు..ఆ తర్వాత ఎందరో త్యాగ ఫలం కారణంగా మనం ఇప్పుడు స్వేచ్చగా బ్రతుకుతున్నాము..భారత దేశం పై గల ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఛాటుకుంటూన్నారు..ఇప్పటికే ఎన్నో కళాఖండాలను చూసాము..కానీ ఓ కళాకారుడు అద్బుతాన్ని చేశాడు..అదేంటో ఇప్పుడు ఒకసారి చుద్దాము..
తమిళనాడుకు చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని చాటుకున్నాడు. కంటిలో జాతీయ జెండా పెయింటింగ్​ వేసుకున్నాడు. వైద్యులు వద్దని చెప్పినా కూడా వినకుండా పెద్ద సాహసం చేశాడు..తమిళనాడు.. కోయంబత్తూరులోని కునియముతుర్​కు చెందిన యూఎస్​డీ రాజా అనే సూక్ష్మ కళాకారుడు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు.

కంటిలో జాతీయ జెండా పెయింటింగ్​ను వేసుకున్నాడు. కంటిలో జాతీయ జెండాను తీర్చిదిద్దేందుకు ఎనామిల్ పెయింట్​ను వాడాడు. రాజా స్వతహాగా స్వర్ణకారుడు. చాలా సార్లు సూక్ష్మ కళా చిత్రాలను రూపొందించాడు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వినూత్న కళకు శ్రీకారం చుట్టాడు..

ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రకరకాలుగా పెయింటింగ్స్‌ గీస్తాడు రాజా. ఈ సంవత్సరం దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రజలకు ఓ అరుదైన కళాఖండాన్ని అందించాలని అనుకున్నాడు. అప్పుడే తన స్కూల్లో చదివిన ‘జాతీయ జెండాను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అనే నినాదం గుర్తుకొచ్చింది. అలా జాతీయ జెండాను కంటిలో రూపొందించాలని అనుకున్నాడు.. అదే చేసి చూపించాడు..

ఇలా చేస్తే కంటికి ప్రమాదం అని ఆయన హెచ్చరించారు. అయినా నా మనసు ఒప్పుకోలేదు. ఎనామిల్ పెయింట్‌తో జాతీయ జెండాను గీసి కంటికి పెట్టాను. అద్దం చూసుకుని నేనే స్వయంగా పెయింటింగ్​ను వేసుకున్నాను. దీన్ని పూర్తి చేయడానికి కొన్ని గంటల సమయం పట్టింది. 16 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆఖరికి 17వ సారి విజయం సాధించాను. అప్పుడు నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించింది. విద్యార్థులు, పిల్లలు ఇలాంటి కళాకృతులను కంటిలో గీసుకునేందుకు ప్రయత్నించవద్దు…ఇది చాలా ప్రమాద కరమైంది..కళ్ళు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు..మొత్తానికి ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news