యోగతో సిగరెట్ మానెయ్యోచ్చట.. వదిలించుకోవాలనుకునే వారికోసం…!

-

సిగరెట్‌ మానెయ్యాలనుకుని ఫెయిలయ్యారా..? పొగత్రాగడం మానడం కుదరదని ఫిక్సయ్యారా..? అయితే మీకోసమే ఈ సమాచారం. యోగ ద్వారా సిగరెట్‌ మానెయ్యొచ్చని వాటి కోసం ప్రత్యేక ఆసనాలు ఉన్నాయని తెలుసా..? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. అసలు సిగరెట్‌ త్రాగలనిపించటానికి కారణం మానసిక స్థిరత్వం లేకపోవడం, శరీరం నికోటిన్‌కి అలవాటు పటడం. యోగ చెయ్యడం ద్వారా మొదట నాడీ వ్యవస్థ మెరుగు పడుతుంది. మానసిక స్థిరత్వం వస్తుంది. సిగరెట్‌ త్రాగడం వల్ల శరీరంలో కొంతమేర నష్టం జరిగి ఉంటుంది. సమతుల్యం దెబ్బతిని ఉంటుంది. యోగా ఆసనాలను అనుసరించటం ద్వారా, శరీరంలో కలిగిన ప్రమాదాలను సహజంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా, ఈ ఆసనాల వలన రోగనిరోధక వ్యవస్థలో పెంపుదల, ఆక్సిజన్ సరఫరాను పెంచి, శక్తి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా సిగరెట్‌ మానేసే ప్రక్రియలో తోడ్పడుతుంది. ఆ ఆసనాలేంటో చూద్దాం..

యోగేంద్ర ప్రాణాయామము1, యోగేంద్ర ప్రాణాయామము 4

యోగేంద్ర ప్రాణాయామ-1

ఈ ఆసనము , శ్వాసక్రియా శ్వాసక్రియాను సమతుల్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చాలా సంవత్సరాలుగా సిగరెట్ వలన శరీరంలో కలిగిన ప్రమాదాన్ని తగ్గించే ఆసనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, రోజు ఈ ఆసనాన్ని అనుసరించటం వలన సిగరెట్ తాగాలనే కోరిక తగ్గిపోతుంది. ఈ ఆసనం ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనకరం.

అనుసరించే విధానం
ప్రశాంతంగా, శుభ్రంగా ఉండే ప్రాంతాన్ని యోగ చెయ్యటినికి ఎంచుకోండి. ఈ యోగేంద్ర ప్రాణాయామము ప్రారంభించటానికి మొదట సుఖాసన లేదా, వజ్రాసన భంగిమలో కూర్చిండి. మీకు ఎలా సౌకర్యంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చొని
నెమ్మదిగా గాలి పీల్చుకోండి (5 సెకన్లు). మరో 5 సెకన్ల పాటు ఊపిరిని బిగబట్టాలి. మరో 5 సెకన్లు గాలిని వదలాలి. ఈ విధంగా శ్వాస పీల్చుకునేటప్పుడు, ఆపినప్పుడు, వదిలినప్పుడు 5 వరకు లెక్కించండి.. ఇలా చేసేటప్పుడు శ్వాసపైన ద్యాస పెట్టండి.. ఇలా చేయటం వలన ఉచ్వాస, నిచ్వాస సమయం సమానంగా ఉంటుంది. ఇలా రోజు రోజుకి ఈ శ్వాస తీసుకునే సమయాన్ని పెంచండి.
ఈ ఆసనాన్ని రోజు ఉదయం మరియు పడుకునే ముందు చేయండి.

యోగేంద్ర ప్రాణాయామ-4

వీపును నేలకు తాకిస్తూ వెల్లకిలా పడుకోవాలి, తరువాత మోకాళ్ల వరకు వచ్చి రెండుకాళ్లను దగ్గరగా తీసుకు రావాలి. చెతిని మీ పొట్టపైన ఉంచి నెమ్మదిగా శ్వాసను తీసుకోవాలి.
యోగేంద్ర ప్రాణాయామము 1 లాగానే శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. అయితే ఈ ఆసనంలో శ్వాస పీల్చుకున్నప్పుడు, వదిలుతున్నప్పుడు కానీ చాతి కదలకుండా చూసుకోవాలి. ఈ ఆసనం చెయ్యడం వలన నాడీ వ్యవస్థ మెరుగు పడుతుంది. సిగరెట్ మానలనే కోరిక తీరుతుంది. మరింకెందుకు ఆలస్యం మీకు తెలిసిన వారు గానీ, మీ స్నేహితులు గాని సిగరెట్‌ మానెయ్యాలనుకుంటే ఈ ఆసనాల గురించి వారికి వివరించండి..

Read more RELATED
Recommended to you

Latest news