బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించింది : చంద్రబాబు

-

బడ్జెట్ లో ఏపీకి సరైన కేటాయింపులు లేకపోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిరాశ వ్యక్తం చేశారు. పోలవరం సహా ఏపీకి కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయిందని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని తెలిపారు. 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ఇప్పుడు 5వ స్థానంలోకి రావడం గొప్ప విషయమన్నారు.

అలాగే 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు 20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం కోసం 79 వేల కోట్లు, ఆక్వారంగానికి 6 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రవాణా రంగంలో 100 ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రూ.75 వేల కోట్ల పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను శ్లాబ్​లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news