అబ్బాయిలూ… మీలో ఈ అలవాట్లు ఉంటే.. ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడదట..!!

-

ఏ వ్యక్తి కూడా ఎదుటివారికి వంద శాతం నచ్చరు. మీ స్నేహితుల్లోనే ఒక్కరు ఒక్కో విధంగా ఉంటారు. కానీ అందరు మన స్నేహితులే.. అయితే కొన్ని కామన్‌గా ఉండే అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిల్లో ఉండే ఈ అలవాట్లు అమ్మాయిలకు అసలు నచ్చవు. వాళ్లకు నచ్చకుంటే నాకేంటి అనుకుంటారేమో అబ్బాయిలు.. వీటివల్ల మీరు మీ భాగస్వామితో కూడా సంతోషంగా ఉండలేరు. జెంటిల్మెన్స్ జర్నల్ ప్రకారం.. స్త్రీలు ఇష్టపడని కొన్ని పురుషుల అలవాట్లు ఉన్నాయి. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు పురుషులు ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుల్లో స్త్రీలకు నచ్చని అలవాట్లు ఇవే..

ప్రణాళికలను మార్చుకోవడం- మహిళలకు ప్లాన్స్‌ను పదే పదే మార్చితే అస్సలు నచ్చదు. పురుషుల ఈ ప్రవర్తన వారికి చికాకు కలిగిస్తుంది. కాబట్టి పురుషులు డేటింగ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఒక్కసారి మాత్రమే ప్లాన్ చేసుకోండి, ఆ ప్లాన్‌కు కట్టుబడి ఉండండి. ఒక్క డేటింగ్‌ అనే కాదు.. వాళ్లు ఏదైనా ప్లాన్‌ చేశారంటే.. అది ఇంప్లిమెంట్‌ చేస్తారు. మళ్లీ మార్చరు.. మీరు అలానే ఉంటేనే వారికి నచ్చుతుంది.
చెడు ప్రవర్తన – స్త్రీలు మంచి ప్రవర్తన గల వ్యక్తులకు ఆకర్షితులవుతారు. అందుకే ఆడవాళ్ల ముందు ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు. అది రెస్టారెంట్ వెయిటర్ లేదా డ్రైవర్ కావచ్చు. స్త్రీల ముందు పురుషులు తమ ప్రవర్తనను చక్కగా ఉంచుకోవాలి. స్తీలలు ఎవరినైనా ఈజీగా అర్థంచేసుకోగలరు. మీతో పదినిమిషాలు మాట్లాడరంటే.. మీరేంటి, మీ వ్యక్తిత్వం ఏంటో వాళ్లు అంచనా వేయగలరు. కాబట్టి..వాళ్లతో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగానే ఉండాలి.

గర్వంగా ఉండటం- స్త్రీలకు అహంకారంగా ఉండే పురుషులు అంటే నచ్చదు. అలాంటి పురుషులకు దూరంగా ఉండేందుకు మహిళలు ఇష్టపడతారు.

ఎక్కువ ప్రేమను చూపడం- ఇది మీ అబ్బాయిలకు షాకింగ్‌గానే అనిపించవచ్చు. కానీ స్త్రీలు ఎక్కువ ప్రేమ చూపించే భాగస్వామితో జీవించడం సుఖంగా ఉండరు. మీకు ఉన్న అతి పొసిసివ్‌నెస్‌తో వారు చాలా ఇబ్బంది పడతారు. మీ భాగస్వామి ఎవరితోన క్లోస్‌గా మాట్లాడానినా మీరు తట్టుకోలేరు..ప్రేమ అని మీరు అంటారు.. అనుమానం, సైకోమెంటాలిటీ అని వాళ్లు అంటారు. ప్రేమ ఉండాలి. కానీ అది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేదై ఉండొద్దు.
తక్కువ ప్రేమను చూపడం- అలా అని తక్కువ ప్రేమ చూపించడం కూడా వారికి నచ్చదు. భాగస్వామి అందరిముందు పట్టించుకోనట్లయితే లేదా విస్మరించినట్లయితే, ఖచ్చితంగా ఈ ప్రవర్తన స్త్రీకి చెడ్డ అనుభూతిని కలిగిస్తుంది. ఎంతమందిలో ఉన్న మీ భాగస్వామే మీకు ప్రత్యేకంగా అనిపించాలి. అలా స్త్రీలు. ఫీల్‌ అయినట్లైతే..మీరు బతికిపోతారు. లేదంటే. అంతే.. కాబట్టి.. అటు ఎక్కువ ఇటు తక్కువ కాకుండా బ్యాలెన్స్‌ చేయండి.
సందిగ్ధంలో ఉండటం- ఒక పురుషుడు ప్రతిసారి డైలమాలో ఉండి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే, మీ ఈ అలవాటు ఏ స్త్రీకి నచ్చదు. మహిళలు త్వరగా నిర్ణయాలు తీసుకునే పురుషులను ఇష్టపడతారు.
తల్లి చాటు బిడ్డ కావడం- ఇక అమూల్‌బేబీ అలవాటు కూడా.. ఇది కొత్తలో బానే ఉంటుంది. కానీ పెళ్లయిన తర్వాత కూడా భర్త తన తల్లిని మాత్రమే చూసుకుంటే లేదా తల్లి ద్వారా అన్ని పనులు చేయించుకుంటే, ఈ విషయం భార్యను కలవరపెడుతుంది. తల్లికి ఎంత గౌరవం, విలువ ఇస్తున్నారో.. అంతే గౌరవం, విలువ భార్యకు కూడా ఇవ్వాలి.. మీరు మీ తల్లికి ప్రాధాన్యత ఇచ్చి భార్యను లైట్‌ తీసుకుంటే.. మీ సంబంధంలో గొడవలకు కారణం కావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news