లైఫ్‌లో విజయం సాధించాలని అందరూ అనుకుంటారు.. కానీ కొందరే ఆ స్జేజ్ వరకూ వెళ్లగలుగుతారు. మనలో చాలామందికి వాళ్లమీద వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే ఏమవుతుందో.. బయటకు చెప్తే ఎలా అనుకుంటారో, నేను చేయగలనో లేదో, ఎందుకు అనవసరమైన తలనొప్పి ఇలా అనుకుని అంది వచ్చిన అవకాశాలను కాలదన్నుకుంటారు. జీవితంలో ఈ పాయింట్స్‌ను ప్రతి మనిషి పాటించాలి.. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలట. అప్పుడు విజయం సాధించడం తేలిక అవుతుంది అంటున్నారు మానసిక నిపుణులు.. కాన్ఫిడెన్స్ పెరగాలంటే.. ఈ సింపుల్ టిప్స్ వైపు ఓ లుక్కేయండి..!
సక్సెస్ పోస్టర్..
చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మనం మనకే తెలియకుండా ఎన్నో సాధించి ఉంటాం. అయితే అవి ఆ స్టేజ్‌లో పెద్ద విజయాల్లా మనకు అనిపించి ఉండకపోవచ్చు. కానీ ఒకరిరానిది నీకు వచ్చింది అంటే.. మనలో ఏదో స్పెషల్ ఉంటేనే కదా.. మీ బెడ్‌రూమ్‌లో మీరు చిన్నప్పటి నుంచి.. ఇప్పటి వరకూ సాధించిన విషయాలు అన్నీ ఒక చాట్ మీద రాసి పెట్టుకోండి. అది ఏదైనా కావొచ్చు.. రన్నింగ్ రేసులో గెలవడం, క్లాస్‌లో ఫస్ట్ రావడం, అసలు ఫెయిల్ అవుతా అనుకున్న సబ్జెట్‌లో సీ గ్రేడ్ రావడం, క్లాస్ అంతా ట్రై చేసే అమ్మాయి తన అంతట తానే వచ్చి మీకు ప్రపోస్ చేయడం ఇలాంటివి అన్నీ మీలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుతాయండోయ్..!
మనసుని క్లీన్ చేసుకోండి..
ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. అరే మనల్ని మనమే నమ్మకపోతే.. ఇక సమాజం ఏం నమ్ముతుంది చెప్పండి. మనపై మనకి డౌట్ ఉండడం, భయం, ఆందోళన అన్ని కూడా మనల్ని వెనక్కి నెట్టెస్తాయి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు హార్ట్ ఫుల్‌గా క్లీన్ చేయడం వల్ల పాజిటీవిటి పెరుగుతుంది. వీటన్నింటి స్థానంలో చేయాలన్న ఆశ, ఆనందం, సానుకూలతలను నింపితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
తప్పులు సరిదిద్దుకోవడం..
తప్పులు అందరూ చేస్తారు… కానీ కొందరే సరిదిద్దుకుంటారు. అలా తప్పులు చేయడం వల్లే చాలా విషయాలను నేర్చుకోగలుగుతాం. కాబట్టి.. కొన్ని మార్చుకోలేని వాటిని అంగీకరించి వాటిని ఎలా పాజిటివిటీగా మార్చుకోగలరో తెలుసుకోవడం ముఖ్యం.
పోల్చుకోవద్దు..
అబ్బో.. ఇదైతే..అందరికీ ఏదో ఒక మూల ఉంటూనే ఉంటుంది. మన క్లాస్‌మెట్ మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు..? నాకు వాడికంటే తక్కువ శాలరీ, వాళ్లతో పోల్చుకుంటే నేను అంత అందంగా ఉండను, నా దగ్గర వాళ్లకు ఉన్నంత డబ్బు లేదు ఇలా ఎంత సేపు అవతల వాళ్లతో పోల్చుకుంటే.. మీరు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మన ఏజ్‌కు మనం చేసే ఉద్యోగం గొప్ప.. ఉన్న పరిస్థితులు మెరుగైనవే, ఇంకా ఎలా ఎదగాలా అని ఆలోచించుకోవాలి కానీ.. పొద్దస్తమానం ఎదుటివారితో పోల్చుకుంటే పైసారాదు.!
చాలామందికి ఎదుటివారితో డైరెక్టుగా మాట్లాడే ధైర్యం కూడా ఉండదు. మళ్లీ అదే పర్సన్‌తో గంటల తరబడి అయినా చాటింగ్ చేస్తారు. అంటే మీలో కమ్యునికేషన్ స్కిల్స్‌లో ఏదో లోపం ఉన్నట్లే.. మాట్లాడితే ఏం అనుకుంటారో అనే భయం వదిలేయండి. అది లాగ్వేజ్ అయినా.. మీ వంతు ప్రయత్నం అయితే ఎప్పుడూ మానుకోవద్దంటున్నారు నిపుణులు. మాట్లాడుతూ ఉంటేనే.. స్కిల్స్ పెరుగుతాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలోఅవుతూ.. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటారు కదూ..!
-Triveni Buskarowthu