BREAKING : గుజరాత్​లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం

-

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తోన్న వేళ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. భారతదేశంలోనూ ఎంట్రీ ఇచ్చిన ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకు మహారాష్ట్రలోనే వ్యాపించింది. కానీ తాజాగా ఈ వేరియంట్ గుజరాత్ లోనూ కలకలం రేపుతోంది. బీఎఫ్.7 అనే వేరియంట్ కేసు గుజరాత్​లోని అహ్మదాబాద్​లో నమోదైంది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి అధికమని వైద్యులు తెలిపారు.

60 ఏళ్ల వృద్ధుడికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జులై 15.. రోగి శాంపిల్స్​ను గాంధీనగర్​లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్​కు పంపగా.. అక్టోబరు 17న నివేదిక వచ్చింది. అందులో రోగికి ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయ్యిందని అధికారులు తెలిపారు. అతడితో సన్నిహితంగా ఉన్న 10 మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

మహారాష్ట్రలో గతవారంలో నమోదైన కరోనా కేసుల్లో 17.7శాతం పెరుగుదల కనిపించింది. వీటిలో ఎక్కువగా ఒమిక్రాన్‌ ఉపరకమైన ఎక్స్‌బీబీ ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న బీఏ.2.75తో పోలిస్తే విస్తృత వేగంతో వ్యాప్తి చెందడంతోపాటు రోగనిరోధకతను తప్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఫ్లూ మాదిరి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని.. వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news