Corona: ఫోర్త్ వేవ్ కలకలం.. తాజాగా 8,582 కేసులు నమోదు

దేశంలో ఫోర్త్ వేవ్ కలకలం రేపుతోంది. వరసగా గత వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ ఫోర్త్ వేవ్ రానుందా అనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఇక్కడే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు తెలంగాణలో కూడా గత కొంత కాలం నుంచి కరోనా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు వందలోపే ఉన్న కేసులు ప్రస్తుతం 100 ను దాటుతున్నాయి.

తాజాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8582 కేసులు నమోదు అయ్యాయి. కేవలం 4 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44513 కు పెరిగింది. గత మూడు నెలలుగా కరోనా కేసుల సంఖ్య 3 వేల లోపే ఉన్నా.. కొన్ని రోజుల నుంచి క్రమంగా 7 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.  దేశంలో ఇప్పటి వరకు 4,26,52,743 మంది కరోనా బారిపడి కోలుకున్నారు.. ఇప్పటి 5,24,761  మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 195 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించారు.