ఆస్పత్రుల ఆవరణలో కరోనా వైరస్.. సీసీఎమ్ బీ హెచ్చరిక..

కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ వచ్చేసిందని, ఇకపై అన్ని పనులూ చకచకా చేసుకోవచ్చని, ఇంతకుముందు జరిగిన అన్ని నష్టాల నుండీ బయటపడవచ్చని, భవిష్యత్తు మీద ఆశతో జీవిస్తున్న అందరికీ, కరోనా స్ట్రెయిన్ అంటూ కొత్త రూపం వచ్చి బ్రిటన్ ని లాక్డౌన్ లోకి తోసివేసి, మామూలు స్థితికి వస్తుందన్న ప్రపంచాన్ని మళ్ళీ భయాందోళనలకి గురి చేసింది. కరోనా వచ్చిన తర్వాత ఏదైనా ఆసుపత్రికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు.

అక్కడ కరోనా పేషెంట్స్ ఉన్నారేమో అని, చిన్న చిన్న రోగాలకు ఆస్పత్రి వెళ్ళే వారి సంఖ్య బాగా తగ్గింది. తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అనిపిస్తుంది. సీసీఎమ్ బీ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో కరోనా పేషెంట్లు ఉన్న ఆస్పత్రి ఆవరణలో కరోనా వైరస్ ఉంటుందని తెలిపింది. మొహాలీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జరిపిన అధ్యయనం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.