కరోనా భయంతో తెలంగాణ లో హై టెన్షన్..!

-

తెలంగాణాలో కరోనా వైరస్ నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. తెలంగాణాలో మూడు కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. అనుమానం ఉంది అంటే చాలు అనుమానితులను ప్రత్యేక వార్డుల్లో పెట్టి చికిత్స చేస్తున్నారు. దీనిపై తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్స చేస్తారని కాని టెస్టులు మాత్రం ప్రభుత్వ ల్యాబుల్లోనే చేస్తారని స్పష్టం చేసారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు గాని అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు. కరోనా అనుమానంతో ప్రతి ఒక్కరూ గాంధీ ఆస్పత్రికి రావాల్సిన పనిలేదని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.

డబ్బు ఉండి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోగలిగిన వారికి ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని అన్నారు. ఆ ఆస్పత్రుల్లోనే శాంపిల్స్ సేకరించి మాకు పంపండని ఆయన అన్నారు. మహావీర్, మమత, సురభి, అపోలో, భాస్కర, మల్లారెడ్డి, మెడిసిటీ, ఎంఎన్ఆర్, ప్రతిమ, సాధన లాంటి ఆస్పత్రులు ముందుకు వచ్చాయి. ప్రతి మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో 50 బెడ్లు ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

కరోనా ఒకరికి వస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది అనేది నిజం కాదని అన్నారు. వైరస్ గాలితో వ్యాపించే అవకాశం లేదని, ఆ వ్యక్తి తుమ్మినా దగ్గినా సరే వస్తుందని అన్నారు. స్వైన్ ఫ్లూ లాంటి భయంకరమైన వ్యాధినే ఎదుర్కొన్నామని, కరోనాను కూడా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కరోనా వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే కరోనా రిపోర్టులు పాజిటివ్ వచ్చాయని, మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news