ఓ పక్కన న్యూయర్‌ వేడుకలు.. మరో వైపు గుజరాత్‌లో వైరస్‌ కొత్త వేరియంట్‌ కలకలం

-

ఒక పక్కన న్యూయర్‌ వేడుకలు.. మరో పక్కన ముంచుకొస్తున్న వైరస్.. కరోనా ఒమిక్రాన్‌ వంటి ప్రాణాంతక వేరియంట్ల ముప్పు నుంచి బయటపడిన జనాన్ని తాజాగా ఎక్స్‌ బీబీ 1.5వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి జన్యుమార్పులు జరిగి కొత్త వేరియంట్‌గా భారత్‌లోకి అడుగుపెట్టింది. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్‌గా గుర్తించిన నిపుణులు దీన్ని కోవిడ్ ఎక్స్‌ బీబీ 1.5 వేరియంట్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వైరస్‌ తాలుక పాజిటివ్ కేసు గుజరాత్‌లో నమోదవడంతో వైద్య అధికారులు ఇంకా ఆందోళన చెందుతున్నారు.

గుజరాత్‌లో నమోదైన తొలి ఎక్స్‌ బీబీ 1.5 వేరియంట్ సూపర్ వేరియంట్‌గా అమెరికా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇది బీక్యూ 1 వేరియంట్‌ కంటే 120 రెట్లు అధిక వేగంగా వ్యాప్తి చెందుతుందట.. ఈ వేరియంట్‌తో ఇప్పటికే అమెరికాలో కొన్ని కేసులు బయటపడ్డాయి. చైనా సంతతికి చెందిన అమెరికా వైద్యుడు ఎరిక్ ఫీగల్ డింగ్ అనే వ్యక్తి కోవిడ్ ఎక్స్‌ బీబీ 1.5 వేరియంట్ మానవ వ్యాధి నిరోధక వ్యవస్థను ఏమార్చే సామర్ధ్యం కలిగినదిగా హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌ పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

ఎక్స్‌ బీబీ 1.5 వేరియంట్‌ను గుర్తించిన 17 రోజుల వ్యవధిలోనే ఇది చాలామందికి వ్యాపించింది. ఒకప్పుడు కరోనా వైరస్‌ను చైనా ఎలా దాచిపెట్టిందో, ఈ కొత్త వేరియంట్‌ను అమెరికా కూడా దాచిపెట్టిందని ఎరిక్ ఫీగల్ డింగ్ ఆరోపిస్తున్నారు.. అమెరికాలో అక్టోబరులోనే ఇది వెలుగుచూసిందని, ఇప్పుడిది అమెరికా నగరాల్లో వేగంగా ప్రబలుతోందని తెలిపారు. ఒమిక్రాన్‌తో పోల్చితే ఇది భిన్నంగా ఉన్నందున దీనిపై ప్రభుత్వానికి అవగాహన లోపించిందని, ప్రజలను కూడా సరిగా హెచ్చరించలేకపోయిందని విమర్శించారు.

గుజరాత్‌లో తొలి కేసు నమోదవడం చూస్తుంటే ప్రతి ఒక్కరిలో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని వదిలిపెట్టేలా లేదు. వైరస్‌ అనేక రూపాలు మార్చుకొని మానవాళిపై దండయాత్ర చేస్తూనే ఉంది. కరోనా ఒమిక్రాన్‌ వంటి ప్రాణాంతక వేరియంట్ల ముప్పు నుంచి బయటపడిన జనాన్ని తాజాగా ఎక్స్‌ బీబీ 1.5వేరియంట్ గుబులు పుట్టిస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త వైరస్‌లు ఏం చేస్తాయో ఏంటో..!

Read more RELATED
Recommended to you

Latest news