ఈ ఏడు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మన జోలికి రాదు..!

-

ఇన్నాళ్ళు చైనాకు మాత్రమే పరిమితం అయిన కరోనా వైరస్ ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చేసింది. హైదరాబాద్ లో కరోనా బాధితుల సంఖ్య పెరగకపోయినా సరే మీడియా చేస్తున్న హడావుడి ప్రజలను భయపెడుతుంది. ఇక తాజాగా కరోనా వైరస్ విషయంలో మంత్రి వర్గం చర్చించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఎక్కడిక్కడ హోర్డింగ్ లు ఏర్పాటు చేసి కరోనా వైరస్ గురించి ప్రభుత్వం పలు సూచనలు చేస్తూ వస్తుంది.

ఏడు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ మన వద్దకు రాదని చెప్తున్నారు వైద్యులు.

ఎప్పటికప్పుడు సాని టైజర్ తో చేతులు శుభ్రం చేసుకోండి.

సబ్బుతో ఎక్కువ సేపు చేతులు కడగండి

వ్యక్తిగత పరిశుభ్రత

జలుబు దగ్గు వస్తే అప్రమత్తం అవ్వండి

అపోహలు నమ్మవద్దు.

కరోనా పీడిత దేశాల నుంచి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలి.

జన సమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో మాస్క్ ధరించడం.

ఇప్పటి వరకు భారత్ లో కరోనా కు సంబంధించి 5 కేసులు నమోదు అయినా మరణాలు మాత్రం లేవు. అటు కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కేంద్రం దీనిపై హై అలెర్ట్ ప్రకటించింది. తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేసింది. కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ని కూడా పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news