ఓహో.. మోదీ దీపాల‌ను వెలిగించ‌మ‌న్న‌ది.. ఇందుకోస‌మేనా..?

-

క‌రోనాపై రోజుకు 24 గంట‌లూ పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు.. త‌దిత‌ర రంగాలకు చెందిన వారికి మ‌ద్ద‌తుగా జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌జలంద‌రూ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొట్టాల‌ని.. గ‌తంలో ప్ర‌ధాని మోదీ పిలుపునివ్వ‌గా.. అందుకు ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. అయితే ఇప్పుడు మోదీ మళ్లీ ఒక సామూహిక కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు ప్ర‌జ‌లంద‌రూ త‌మ త‌మ ఇండ్ల‌లో లైట్ల‌ను ఆర్పేసి దీపాల‌ను వెలిగించాల‌ని.. పిలుపునిచ్చారు. అయితే జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజున స‌ద‌రు అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించే సిబ్బందికి మ‌ద్ద‌తుగా, వారికి ఉత్సాహాన్ని అందించేందుకు గాను అంద‌రం చ‌ప్ప‌ట్లు కొట్టాం. బాగానే ఉంది.. కానీ ఏప్రిల్ 5న రాత్రి దీపాల‌ను వెలిగించాల‌ని మోదీ అస‌లు ఎందుకు పిలుపునిచ్చారు..? ఇందులో ఉన్న ఆంత‌ర్య‌మేమిటి..? అని అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. అయితే కొంద‌రు మాత్రం ఈ సందేహానికి స‌మాధానం ఇచ్చారు. అదేమిటంటే…

this is why pm modi told us to light diyas

ఏప్రిల్ 5వ తేదీ.. ఆదివారం.. వామ‌న ద్వాద‌శి.. మ‌ఖ‌, పుబ్బ న‌క్ష‌త్రాల క‌ల‌యిక‌. ఆ స‌మ‌యంలో దీపం వెలిగిస్తే.. చెడు అంతం అవుతుంద‌ట‌. అలా అని శాస్త్రం చెబుతుంద‌ట‌. ఈ విషయం కేవ‌లం అమ్మ‌వారిని పూజించే వారికే తెలుస‌ట‌. అందుక‌ని ఆ రోజున అంద‌రూ క‌చ్చితంగా దీపం వెలిగించాల‌ని చెబుతున్నారు. అందులో భాగంగానే మోదీ కూడా ఆ రోజున దీపం వెలిగించాల‌ని పిలుపునిచ్చార‌ని కొంద‌రు చెబుతున్నారు.

అయితే క‌రోనాపై పోరాటం చేసేందుకు దేశ‌ప్ర‌జ‌లంతా ఒకే తాటిపై సిద్ధంగా ఉన్నారు.. అనే విష‌యాన్ని చాటి చెప్పేందుకే.. దీపం వెలిగించాల‌ని మోదీ అన్నారు. ఈ క్ర‌మంలో ఈ విషయంపై కొంద‌రు సోష‌ల్ మీడియాలో జోకులు కూడా పేలుస్తున్నారు. కానీ ఆ రోజున ఆ కార్య‌క్ర‌మంతోపాటు మోదీ ఇంకా ఏమైనా చెబుతారా..? అని కూడా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో మోదీ ఏమైనా చెబుతారు కావ‌చ్చ‌ని.. ప‌లువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఏది ఏమైనా.. మ‌న‌మంద‌రం క‌రోనాపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పేందుకు.. ఆ రోజున ఆ కార్య‌క్ర‌మంలో మాత్రం క‌చ్చితంగా పాల్గొందాం.. ప్ర‌ధాని మోదీకి మ‌ద్ద‌తుగా నిలుద్దాం..!

Read more RELATED
Recommended to you

Latest news