చైనా కోవిడ్‌ విషయంలో నిజాలు చెప్పడం లేదని తేల్చేసిన WHO..

-

ప్రపంచ దేశాలలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో చెప్పలేని పరిస్థితి.. అంచనాలమీద అంతా నడుస్తుంది. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కానీ చైనా మాత్రం ఏ విషయం సరిగ్గా చెప్పటం లేదు. ఇప్పటివరకూ ఆరోపణలే ఉన్నాయి.. కానీ ఇది నిజమే అని డబ్యూహెచ్వో తేల్చేసింది.

 

కొవిడ్-19 విషయంలో చైనా మొదటి నుంచి వివరాలను దాచి పెడుతూనే వచ్చింది. ఈ విషయంలో చాలా దేశాలు.. చైనాపై చాలా ఆగ్రహంగా ఉన్నాయి.. తొలుత కొవిడ్ విజృంభించిన సమయంలోనూ డ్రాగన్ దేశం సరైన వివరాలు తెలపకపోవడం వల్ల.. ప్రపంచమంతా ఈ వైరస్ వ్యాపించి అపార నష్టాన్ని మిగిల్చిందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి కొవిడ్ పట్ల చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవిడ్ మరణాల గురించి ఆ దేశం నిజాలను చెప్పడం లేదని పేర్కొంది.. కొవిడ్‍తో ఆ దేశంలో చాలా మంది చనిపోతున్నా.. చైనా మాత్రం లెక్కలను దాచిపెడుతోందని WHO తేల్చేసింది..

మరణ మృదంగం..

చైనాలో కొవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య భారీగా ఉందని భావిస్తున్నామని డబ్ల్యూహెచ్‍ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ తెలిపారు.. “చైనాలో రిపోర్ట్ చేయని మరణాలు అధికంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‍వో ఇప్పటికీ భావిస్తోంది. కొవిడ్ గురించి పూర్తి వివరాలను వెల్లడించడం ఎంతో ముఖ్యమని ఆయన చెప్పారు.

అమెరికా బెటర్‌..
కొవిడ్-19 విషయంలో అమెరికా పారదర్శకంగా ఉందని డబ్ల్యూహెచ్‍వో అభిప్రాయపడింది. ఆ దేశంలో ప్రస్తుతం XBB 1.5 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. “డేటాకు సంబంధించి అమెరికా చాలా పారదర్శకంగా ఉంది. డబ్ల్యూహెచ్‍వోకు సహకరిస్తోంది” అని ర్యాన్ పేర్కొన్నారు.

చైనాలో కోట్లాది కొత్త కొవిడ్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం బయటికి వస్తోంది. జీరో కొవిడ్ పాలసీ ఎత్తేశాక పరిస్థితి మరింత దిగజారింది. అయితే మరణాల విషయంలో మాత్రం సమాచారాన్ని చైనా దాచిపెడుతోందనే అనుమానాలు భారి స్థాయిలో ఉన్నాయి. గత నెల మొత్తం మీద కొవిడ్‍తో తమ దేశంలో 37 మంది చనిపోయారని చైనా వెల్లడించింది. అయితే ఈ సమాచారం నమ్మశక్యంగా లేదు.. ఇప్పుడు డబ్ల్యూహెచ్‍వో కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేసింది. చైనా ధోరణి మార్చుకోకుంటే.. పెద్ద ప్రమాదమే ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news