కార్తీకమాసంలో ఒక్కసారి ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి..

-

కార్తీకమాసం అంటే శివుడికి చాలా ఇష్టమైన మాసం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు అందంగా ముస్తాబు అవుతాయి.శివుడి ఆజ్ఞ లేనిది ఆఖరికి చీమ కూడా కుట్టదని పెద్దలు చెబుతారు..అయితే ఈ మాసంలో కొన్ని దేవాలయాలను దర్శించుకుంటే మనం చేసిన పాపాలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు.. ఆ ఆలయాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శివుడు శ్మసానాల్లో తిరిగే లయకారుడు. అందుకే ప్రత్యేక పూజలు,అలంకారాలు అవసరం లేదు నీళ్లు, భస్మంతో అభిషేకం చేస్తే చాలు కరుణించేంత భక్త సులభుడు. అందుకే చాలామంది చివరి రోజుల్లో కాశీలోనే తనువు చాలించాలనుకుంటారు. అక్కడే రూమ్స్ తీసుకుని ఉండిపోతారు..మరణించాక దహనానికి ముందే డబ్బులు కట్టి శివుడిలో ఐక్యం పోతారు. ఇదంతా సరే కానీ మరి పూర్తిగా శివుడిలో ఐక్యం ఐపోవాలంటే ఏం చేయాలి? అప్పుడు వెళ్లాల్సింది కాశీకి కాదు..

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ నగరంలో కొలువైంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ఉజ్జయినికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారనేది మాత్రం అంతుచిక్కని మిస్టరీ. దీనిని మొదట ప్రజాపిత బ్రహ్మ స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాకాళ దేవాలయం శాంతిభద్రతల పరిస్థితులను చూసేందుకు 6వ శతాబ్దంలో చండ ప్రద్యోత రాజు యువరాజు కుమారసేనుని నియమించినట్లు చరిత్ర చెబుతుంది..

ఇకపోతే.. భస్మహారతి. ఇది రెండు రకాలుగా నిర్వహిస్తారు. గోమయం పిడకల్ని విభూతిగా మార్చి రెండు మూటల్లో నింపి వాటిని ఒకదానితో మరొకటి తాడనం చేస్తూ ఆ విభూతి లింగంపై పడుతూ ఆ గర్భగుడి నిండా ఆవరిస్తుంది. మరొకటి శ్మసానంలో మొదట కాలిన శవం బూడిదతో ఇచ్చే హారతి…దీనిని నాగసాధువులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసేందుకు మహిళల్ని అనుమతించరు. ఈ హారతి సందర్భంగా మోగే భేరీలు, మృదంగనాదాలు, కమ్ముకునే విభూతి, పంచాక్షరి ధ్వని, భస్మాభిషేకం చేస్తున్నప్పుడు చదివే మంత్రాలు..ఇవన్నీ అక్కడుకున్న వారందర్నీ ఓ అలౌకిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లిపోతుంది..

శివుడిలో ఐక్యం కావాలనే కోరిక ఉన్నవారు అందుకోసం ముందే ఏర్పాట్లు చేసుకుంటారు. అక్కడే మరణించాలని, శివక్యం చెందాలని భావిస్తారు. అలా వారు మరణించిన తర్వాత చితా భస్మాన్ని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. దేవుడిలో పరిపూర్ణంగా ఐక్యం కావాలనే వాంఛ రోజుకి ఒకరికి మాత్రమే నెరవేరుతుంది..కాగా,భస్మ హారతి చూడాలి అనుకుంటే మాత్రం ముందుగానే ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది..కాశీని చూసి చనిపోతే ఆత్మ శాంతిస్తుందని పెద్దలు కూడా చెబుతారు..

Read more RELATED
Recommended to you

Latest news