ఒక్క ఉప ఎన్నిక ఫలితంతోనే టీఆర్‌ఎస్‌ వాళ్ళు అహంకారంతో కుక్కల్లా మొరుగుతున్నారు : బండి సంజయ్‌

-

మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తాజాగా ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. TRS నేతలు కండకావరం తో అహంకారం తో మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా.. ఇచ్చిన హామీల గురుంచి చెప్పకుండా గర్వం తో మాట్లాడుతున్నారు. ఒకటి గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు. నీకు దమ్ముంటే 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామ చేయించు… ఎన్నికలకు మేము సిద్దం మీరు సిద్దమా…బిజెపి లో ఎమ్మేల్యే చేరాలి అంటే రాజీనామ చేసి రావాలి… మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీజేపీ తరపున శుభాకాంక్షలు.. ప్రజా తీర్పును శిరసావహిస్తాం.. ఓడినా… గెలిచినా… నిరంతరం ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తాం. దాడులు జరిగినా… గుండాలకు భయపడకుండా రాజగోపాల్ రెడ్డి కష్టపడి ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు.

Bandi Sanjay Kumar: CM enacted new drama fearing Kavitha's arrest in liquor  scam

లాఠీ ఛార్జ్ లు, బైండ్ ఓవర్ కేసులు, ఇలా ఎన్ని బెదిరింపులకు పాల్పడినా… కష్టపడి మా కార్యకర్తలు పనిచేశారు… వాళ్ళకి నా సెల్యూట్. మా నేతలు అందరూ సమన్వయం తో పనిచేశారు. విమర్శలు, ప్రతివిమర్శలకు ఇది సమయం కాదు. ఒక్క ఉప ఎన్నిక ఫలితం తోనే trs వాళ్ళు అహంకారంతో కుక్కల్లా మొరుగుతున్నారు. ఎన్నికల హామీలను 15 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు.. ఇచ్చిన సమయంలోపు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా. Trs నేతల అహంకారం చూసి, ఎందుకు trs ను గెలిపించామా..? ఎందుకు తప్పు చేశామని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా trs లో కలుపుకున్న నేతలు… వెంటనే ఆ 12మంది తో రాజీనామా చేయించి, గెలవాలని సవాల్ చేస్తున్నా.

 

బీజేపీ ఎప్పుడూ కూడా రాజీనామా చేయించిన తర్వాతనే… పార్టీలోకి ఆహ్వానిస్తుంది.
మునుగోడులో గెలిచిన ఈ గెలుపు నిజంగా ఎవరిదో చెప్పాలి. Trs పార్టీ… మునుగోడు లో కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఇచ్చి లేపే ప్రయత్నం చేసింది. బీజేపీ ని ఎదుర్కొనేందుకు trs, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి తెచ్చుకున్న మెజారిటీ కేవలం 11వేలు మాత్రమే. మునుగోడు లో ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చి పనిచేస్తే వచ్చింది కేవలం 11000 వేల మెజారిటీ నే… మరి వీళ్ళు ఒక్కరిగా తమ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తారా? పిల్లి పులితోలు కప్పుకుంటే… పులి కాదు… పిల్లి, పిల్లే. నరేంద్రమోదీ తో వీళ్ళకి పోలిక అన్నదే లేదు…ఆయనతో పోల్చుకోడానికి. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం.’ అని మండిపడ్డారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news