నిజమైన ప్రేమ అంటే అర్ధం ఇదేనా…?

-

ఐ లవ్ యు’ ఒక అమ్మాయినో అబ్బాయినో ప్రేమించే ప్రతీ ఒక్కరు చెప్పే ఒక సరదా మాట. క్షమించాలి ఈ మాట అంటున్నా౦ అని… ఏమో మరి “మనలోకం” అది సరదా మాటే అనేది మా అభిప్రాయం. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి…? ఎవరికి తెలుసు చెప్పండి. ఈ రోజుల్లో అమ్మాయిని చూడగానే జడ బాగుందని, నడుం తిప్పుతూ నడుస్తుందని, మాట బాగుందని, చూడటానికి బాగుంది అని ఐ లవ్ చెప్పేస్తాడు ప్రతీ ఒక్కడు.

అమ్మాయిలు కూడా అంతే కదా..? అబ్బాయి స్టైల్ గా మాట్లాడితే, వాడికి చింపిరి జుట్టు ఉంటే, డామినేట్ చేస్తే, డిగ్నిటీగా ఉంటే ఐ లవ్ యు చెప్పేస్తారు. కాని మా అభిప్రాయం ప్రకారం ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎక్కడా కనపడటం లేదు. నిజమైన ప్రేమ అంటే మా అభిప్రాయం ప్రకారం ఏంటో చూడండి…

ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.
ఒకరి అభిప్రాయానికి ఒకరి వద్ద విలువ ఉండాలి.
తల్లి తండ్రులకు గౌరవం ఉండాలి.
భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ప్రేమించాలి.
ప్రేమలో కోరికలు, డబ్బు చూడకూడదు.
ప్రేమలో సంతృప్తి వెతకకూడదు.
ప్రేమలో ఆశయాలు ఉండకూడదు.
ప్రేమలో నిబద్దత ఉండాలి.
ప్రేమించిన వ్యక్తి పట్ల ఒక అవగాహన ఉండాలి.
గ్యాప్ అనే దాని గురించి ఆలోచించకూడదు.
డబ్బుని ప్రాతిపదికగా తీసుకోరాదు.
ప్రేమలో డబ్బు ప్రస్తావన ఉండకూడదు.
జాతి భేదాలు ఉండకూడదు.
నీకంటే నేను గొప్ప అనే అభిప్రాయం ఉండకూడదు.
ప్రేమించే వ్యక్తి పట్ల స్వార్ధం అవసరం. (కచ్చితంగా)
ప్రేమించే వ్యక్తి కోసం త్యాగం అవసరం.
అవసరాల కోసం అడుగులు వేయకూడదు.
ఆస్తుల ప్రస్తావనకు దూరంగా ఉండటంతో పాటు స్టేటస్ విషయాలను ప్రస్తావించరాదూ.

ఇలాంటివి ప్రేమలో చాలా ఉంటాయి. ప్రేమ అనేది ఎప్పుడు సమయం వృధా చేసుకునే అంశం కాదు. కాబట్టి ప్రేమను ఎప్పుడు సిల్లీ గా తీసుకోకూడదు. ప్రేమించాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్నవాడే ప్రేమ కోసం నడవాలి. ప్రేమలో ఇద్దరి మధ్య భావోద్వేగాలు అదుపు చేసుకోగలగడం ప్రధాన అంశం.

Read more RELATED
Recommended to you

Latest news