2019లో పొలిటికల్ హైలెట్స్…!

ఈ ఏడాది దేశ రాజకీయాల్లో అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు కూడా ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. అవి ఏంటి అనేది ఈ స్టొరీలో చూద్దాం…

ప్రధాని నరేంద్ర మోడికి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకం కావడం, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీ కలిసి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవడం అనేది రాజకీయ పరిశీలకులను కూడా విస్మయానికి గురి చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి సాధించిన సీట్లు కూడా ఈ ఏడాది సంచలనమే… 303 స్థానాలతో బిజెపి విజయం సాధించింది. బెంగాల్ 17 సీట్లు, తెలంగాణా లో 4 ఎంపీ సీట్లు బిజెపి గెలవడం అనేది అంచనాలను తలకిందులు చేసింది.

విపక్షాలు అన్నీ ఏకమైనా సరే బిజెపి వాళ్ళ వ్యూహాలను తిప్పి కొట్టింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధి రాజీనామా చేయడం, ఎంత మంది ఒప్పించే ప్రయత్నాలు చేసినా ఆయన అంగీకరించకపోవడం,

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంని సిబిఐ అరెస్ట్ చేయడం కూడా ఈ ఏడాది కీలక అంశం.

సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ గా ఉన్న రంజన్ గోగోయ్ మీద లైంగిక ఆరోపణలు ఈ ఏడాది రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది.

కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం కూలిపోవడం కూడా ఈ ఏడాది జరిగింది. జెడిఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని బిజెపి కూల్చింది.

ఇలా ఈ ఏడాది ఎక్కువగా రాజకీయం మొత్తం బిజెపి చుట్టూనే తిరిగింది.