ఫ్యాక్ట్ చెక్: కోవిడ్-19 వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చా..?

కరోనా సెకండ్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు ఎక్కువై పోతున్నాయి. గత పది రోజులుగా చూసుకుంటే లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. మన భారత దేశం లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీనితో పలు చోట్ల లాక్ డౌన్ కూడా విధించారు. కరోనా మహమ్మారి జనాల్ని ఇంకా పట్టిపీడిస్తోంది.

ఇప్పటికి ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఏది ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ ని ఉపయోగించడం లాంటివి కనీస నియమాల్ని పాటించాలి. ఒక పక్క కరోనా వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి వచ్చిన కరోనా కేసులు తగ్గుముఖం చూపడం లేదు.

అయితే తాజాగా కోవిడ్ 19 వాక్సినేషన్ అపాయింట్మెంట్ వాట్సాప్ లో బుక్ చేసుకోవచ్చు అనే ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాం… అయితే ముందు అసలు ఏం జరిగింది అనేది చూస్తే… వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని ఒక ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయానికి మనం వస్తే…

ఇది 100% ఫేక్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి వీలు లేదు. కేవలం దానిని కోవిన్ మరియు ఆరోగ్య సేతు అప్ లో మాత్రమే బుక్ చేసుకోవడానికి అవుతుంది. వాట్సాప్ ద్వారా వచ్చిన పోస్టులు నిజం కాదు. కేవలం covid19 వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారానే అవుతుంది. వాట్సప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని.