ఫ్యాక్ట్ చెక్: BSNL నోటిస్ మీకూ వచ్చిందా..? నమ్మచ్చా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది ఆ నకిలీ వార్తలని చూసి మోస పోతూ వుంటారు. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం.

నకిలీ వార్తల్ని చూసి చాలా మంది ఇతరులకి కూడా పంపుతూ వుంటారు. ఆ తప్పులని చెయ్యద్దు. నకిలీ వార్తల్ని చూసి జాగ్రత్త పడండి. ఇక మరి తాజాగా సోషల్ మీడియా లో షికార్లు కొడుతున్న ఆ వార్త కోసం చూసేద్దాం.

బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ నోటీసులని పంపుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది కస్టమర్స్ కేవైసీ ని TRAI సస్పెండ్ చేసిందని… 24 గంటల్లో సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుందని అందులో ఉంది. మరి ఇది నిజమేనా…? నిజంగా 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ అవుతుందా..? ఈ విషయానికి వస్తే.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కాబట్టి అనవసరంగా సోషల్ మీడియా లో షికార్లు కొడుతున్న నకిలీ వార్తలని చూసి మోసపోకండి అలానే ఎప్పుడు కూడా వ్యక్తిగత వివరాలని బ్యాంకు డీటెయిల్స్ ని ఎవరితోనూ పంచుకోకండి. ఇటువంటి వివరాలని మీరు ఇతరులతో పంచుకుంటే మీరే నష్ట పోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news