ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వం దీపావళి వరకు రైళ్లని రద్దు చేస్తోందా..? మళ్ళీ లాక్ డౌన్ ఉంటుందా..?

-

అక్టోబర్ 12 అంటే ఈ రోజు నుండి కూడా ప్రభుత్వం లాక్ డౌన్ ని విధిస్తోంది అన్న వార్త వచ్చింది. అయితే తాజాగా కరోనా మహమ్మారి కేసులు ఎక్కువ అవుతున్నాయని అందు కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఒక వార్త వచ్చింది. అయితే ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు మనం చూద్దాం.

కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి కేసులు ఎక్కువై పోయాయి అని ప్రభుత్వం లాక్ డౌన్ ని విధించాలని నిర్ణయం తీసుకుందని ఒక ఫేక్ స్క్రీన్ షాట్ న్యూస్ ఛానల్ లోగో తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా వైరల్ అవ్వడం జరిగింది.

ఏడు లక్షల కేసులు వచ్చాయని అందుకే లాక్ డౌన్ ని పెట్టాలని అనుకుంటున్నారు అని అందులో ఉంది. అలానే దీపావళి వరకు కూడా రైళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది అని అందులో ఉంది. అయితే దీనిని పరిశీలించి చూస్తే… ఈ వార్త లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే అని స్పష్టంగా తెలిసింది. అయితే ప్రభుత్వం ఇలాంటి అనౌన్స్మెంట్ ఏమీ చేయలేదని క్లియర్ గా తెలిసి పోతోంది. కనుక ఇలాంటి ఫేక్ వార్తలని ఎవరు నమ్మద్దు వాటిని ఫార్వర్డ్ చెయ్యొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news