ఫ్యాక్ట్ చెక్: నీట్ ఎగ్జామ్స్ డేట్ వాయిదా పడిందా?

-

సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్త చక్కర్లు కోడుతుంది. అందులో కొన్ని నిజం ఉంటే మరి కొన్ని మాత్రం ఫేక్ ఉంటాయి.. వాటి గురించి సరైన అవగాహాన లేకపోవడంతో అలాంటి వాటిని నమ్మి చాలా మోస పోతున్నారు.తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ అండర్‌ గ్రాడ్యుయేట్‌-2022 పరీక్ష వాయిదా వేశారంటూ నెట్టింట ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది.జులై 17కి బదులు సెప్టెంబర్ 4న పరీక్ష జరుగుతుందనేది ఫేక్‌ న్యూస్ సారాంశం. దీనిపై స్పంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ విధంగా వివరణ ఇచ్చింది. ‘నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన యూజీ 2022 పరీక్ష తేదీ జులై 17కు బదులు సెప్టెంబర్‌ 4న జరుగుతుందనే జస్టీస్‌ ఫర్‌ నీట్‌ యూజీ, డిఫర్‌ నీట్‌ యూజీ అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో ఫేక్‌ న్యూస్‌ హల్‌చల్‌ చేస్తోంది.

ఎన్టీఏ నీట్‌ యూజీ పరీక్షను వాయిదా వేయలేదు. అది నకిళీ వార్త. త్వరలో నీట్ యూజీ 2022 అడ్మిట్‌ కార్డులను విడుదల చేస్తామని, అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌ ntaneet.nic.inలో అందుబాటులో ఉంటాయని’ స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది.ఈ ఏడాది నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష కోసం దాదాపు 8 లక్షల మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 10.64 లక్షల మంది మహిళా అభ్యర్ధులు కావడం గమనార్హం. 8.07 మంది పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మొత్తం 18.72 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్‌ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జులై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో ఎన్టీఏ నీట్‌ పరీక్షను నిర్వహించనుంది..ఇలాంటి వాటి గురించి ప్రభుత్వం అధికారికంగా చెబుతుందని, ఇలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news