ఫ్యాక్ట్ చెక్: పాకిస్తాన్ అని వచ్చిన వరద వీడియో.. ఇందులో నిజమెంత ..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో తప్పు త్రోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. జూన్ లో పాకిస్తాన్ లో వచ్చిన వరదల వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పైగా వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ వరదలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.

పైగా కరాచీకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ వీడియోలో రోడ్డు మీద నీరు ఉండిపోవడం వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకు పోవడం మనం చూడొచ్చు. వన్ ఇండియా దీనిపై పరిశీలన జరపగా ఈ వీడియో జపాన్లో 2011 లో వచ్చిన భూకంపం ఎప్పటిది అని తెలుస్తోంది. పైగా ఫోటోలను కూడా పరిశీలించి చూస్తుంటే అవి పాకిస్థాన్ కి చెందినవి కాదని తెలుస్తోంది. కనుక సోషల్ మీడియా లో వచ్చిన ప్రతీ దానిని నమ్మకండి. ఏది నిజం ఏది అబద్దం అనేది చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news