ఫ్యాక్ట్ చెక్: రూ.10,100 కడితే రూ.30 లక్షలా..?

-

తరచు మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త కనబడుతూనే ఉంటుంది. నిజానికి నకిలీ వార్తల తో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నమ్మారు అంటే చిక్కుల్లో పడినట్లే. అయితే తాజాగా డబ్బులకి సంబంధించి ఒక వార్త వచ్చింది. అయితే మరి దాని కోసం ఇప్పుడు చూద్దాం.

 

తాజాగా ఒక నోటిఫికేషన్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పదివేల రూపాయల ని డిపాజిట్ చేస్తే 30 లక్షలు రిటర్న్ కింద పొందొచ్చని ఆ వార్తలో ఉంది. అయితే నిజంగా ఇది నిజమేనా లేదంటే ఇది ఈ నకిలీ వార్తా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లెటర్ ని తీసుకు వచ్చినట్లు వార్తలో ఉంది.

అయితే పది వేల రూపాయల ని డిపాజిట్ చేస్తే 30 లక్షలు తిరిగి పొందవచ్చని దానిలో ఉంది. కానీ ఇది నకిలీ వార్త మాత్రమే. పైగా ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలని పొందినట్లు కూడా నకిలీ వార్తని స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే డిపాజిట్ చేసిన అమౌంట్ మీకు కనపడదు అని..

ప్రాసెస్ లో ఉంది అని అందులో రాసి ఉంది. అయితే ఈ వార్త నిజం కాదు అనవసరంగా మీరు పదివేల ని కట్టకండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటివేమీ తీసుకు రాలేదు. ఇది కేవలం నకిలీ వార్త మాత్రమే కాబట్టి వీలైనంత వరకూ నకిలీ వార్తలకు దూరంగా ఉండటం మంచిది లేదంటే అనవసరంగా చిక్కుల్లోపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news