ఫ్యాక్ట్ చెక్: విజేతలకు 3,000తో ఆ అవకాశాన్ని అందించడం ద్వారా ఐస్ పవర్ గ్రిడ్ లక్కీ డ్రాను అమలు చేస్తుందా?

సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ లు ఎక్కువ అయ్యాయి..ప్రభుత్వం ఇటువంటి వాటి గురించి అస్సలు నమ్మవద్దని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.. తాజాగా మరో న్యూస్ చక్కర్లు కోడుతుంది.గ్రహీతకు లాటరీ తగిలిందని మోసగాళ్లు ఈ-మెయిల్‌లు, సందేశాలు పంపిస్తున్నారు.అలాంటి ఒక సంఘటనలో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రాను నడుపుతోందని పేర్కొంటూ, ప్రజలకు రూ. 6,000 గెలుచుకునే అవకాశం కల్పిస్తోందని మోసపూరిత వెబ్‌సైట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

 

పవర్‌గ్రిడ్’ పేరుతో ఒక లక్కీ డ్రా ద్వారా ఒకరి వ్యక్తిగత వివరాలను కోరిన తర్వాత ₹6,000 విలువైన విద్యుత్ అలవెన్స్‌ను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు మోసపూరిత లాటరీ ప్రకటన పేర్కొంది. దీనికి, ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం, ఈ లాటరీ స్కామ్ అని పిఐబి పేర్కొంది.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిక ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ ‘PIB ఫాక్ట్ చెక్’ సోషల్ మీడియాలో చెలామణి అవుతున్న నకిలీ లాటరీ గురించి అందరినీ మరోసారి అప్రమత్తం చేసింది.. ఇలాంటివి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి..ఇప్పుడు కూడా ఇలాంటి వాటి గురించి అలర్ట్ చేసింది..దీనికి సంభంధించిన పోస్ట్ ట్విటర్ లో వైరల్ అవుతుంది..ఇలాంటి నకిలీ వార్తల గురించి నమ్మే ముందు పూర్తీ వివరాలను తెలుసుకోవాలని అధికారులు హెచ్చరించారు..