ఫ్యాక్ట్ చెక్: రాత్రిపూట వాట్సాప్ పని చెయ్యదా..? ఇందులో నిజమెంత..?

-

ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ఫేక్ వార్తలు తెగ వినపడుతున్నాయి. అయితే నిజంగా వాటిని నమ్మాలో లేదో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు. తాజాగా వాట్సాప్ కి సంబందించిన వార్త వచ్చింది. అది ఏమిటంటే.. రాత్రి పూట వాట్సాప్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపి వేస్తుందని, వాట్సాప్‌ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించిందని ఒక వార్త సోషల్ మీడియా లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

whatsapp

దీనిలో నిజం ఎంత అనేది చూస్తే… వాట్సాప్‌ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయించిందని.. పైగా దీనిని యాక్టివేట్ చేసుకోవాలంటే నెల వారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అందులో ఉంది. దీనిని పరిశీలించగా ఈ వార్త లో ఏ మాత్రం నిజం లేదని ఇది వట్టి ఫేక్ న్యూస్ అని అర్ధం అవుతోంది.

అలానే ఈ పుకార్ల పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రచారంలో నిజం లేదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఫ్యాక్ట్‌ చెక్‌ ట్విటర్‌ వేదికగా స్పష్టత ఇచ్చింది. కనుక ఇలాంటి ఫేక్ వార్తలని అస్సలు నమ్మకండి. అలానే ఫార్వార్డ్ చేసి ఇతరులను కూడా నమ్మించద్దు. నిజమో కాదో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అంతే కానీ గుడ్డిగా నమ్మద్దు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news