డబ్బుల విషయంలో ఈ తప్పులని అస్సలు చెయ్యకండి..!

-

డబ్బులని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు చేస్తే అవసరాలకి కూడా డబ్బులు ఉండవు. చాలా మంది ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా డబ్బులు ని ఖర్చు చేసే విధానం లో పొరపాట్లు చేస్తూ ఉంటారు. నిజానికి కొన్ని రకాల పొరపాట్ల వల్ల అప్పులపాలై పోయే ప్రమాదం కూడా ఉంది.

పొదుపు ఎందుకు చేయాలి..?

ప్రతి ఒక్కరు కూడా డబ్బులని పొదుపు చేస్తూ ఉండాలి. డబ్బులని పొదుపు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది.

లక్ష్యాన్ని పెట్టుకోవాలి:

లక్ష్యం ఉన్నప్పుడే మీరు విజయవంతం అవుతారు. మీ లక్ష్యాన్ని నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా మీరు అనుసరిస్తేనే బాగుంటుంది. ఇన్కమ్ టాక్స్ నుండి తప్పించుకోవడం టాక్స్ బెనిఫిట్స్ ని పొందడం ఇన్సూరెన్స్ ఇటువంటివన్నీ కూడా మీ లక్ష్యానికి తగ్గట్టుగా ఉండాలి.

భీమా విషయంలో తప్పు చెయ్యద్దు:

ఇది వరకు కంటే కూడా ఈ మధ్య కాలంలో బీమా కి సంబంధించి అవగాహన బాగా పెరిగింది మీరు మీ వయసు, రెవెన్యూ, కెరియర్ దృష్టి లో పెట్టుకుని టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలి. అవసరాలు చెల్లించగలిగే స్తోమతకు అనుకూలంగానే పాలసీ ని తీసుకోండి.

కచ్చితంగా డబ్బులు దాచుకోండి:

ఇప్పుడు జీతం ఇలా సరిపోతోంది. ఇంకొంచెం పెరిగిన తర్వాత డబ్బులు దాచుకోవచ్చు అని చాలా మంది డబ్బులు దాచుకోరు. కానీ నిజానికి మీరు సంపాదించే కొంత డబ్బుల లో కొంచెం డబ్బుని పక్కన పెట్టి దాచుకుంటే అవసరానికి పనికొస్తాయి.

విలాసాలకి పోవద్దు:

చాలా మంది తక్కువ డబ్బులు సంపాదిస్తున్నా విలాసాల కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఆ తప్పును చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news