పవన్ ‘రీల్’ హీరో.. నేను ‘రియల్’ హీరో.. 7 యుద్ధాలను ఆపాను: కేఏ పాల్

169

డ్యాన్స్ కానీ.. రన్నింగ్ కానీ.. డిబేట్ కానీ.. దేనికైనా నేను సిద్ధం.. డబ్బు తీసుకురావడానికి, సంపాదించడానికి, ఏ పని చేయడానికి కూడా వాళ్లు నాతో పోటీపడలేరు.

ఏపీలో జరిగే ఎన్నికల్లో ప్రధానంగా పోటీలో ఉన్న పార్టీలు ఏవీ అంటే టక్కున వైఎస్సార్సీపీ, టీడీపీ అని చెబుతాం. సరేలే.. కొంచెం జనసేన కూడా. కానీ.. ఏపీలో ప్రజాశాంతి అనే పార్టీ ఇంకోటి ఉందనే విషయం మీకు తెలుసా? తెలిస్తే. ఆ పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ అని తెలుసా? తెలిసే ఉంటుంది లేండి. ఎందుకంటే ఆయన కామెడీలను మనం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం కాబట్టి.. ఆయన గురించి అంతో ఇంతో మీకు తెలిసే ఉంటుంది.

కానీ.. ఇప్పుడు మనం పాల్ గురించి చెప్పుకోబోయే విషయం మాత్రం మీకు కాదు కదా.. ఎవ్వరికీ తెలియదు. పాల్ అసలు సీక్రెట్ ను ఆయనే బయటపెట్టారు. అది కూడా పవన్ ను టార్గెట్ చూస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.

సినీ నటులు పవన్ కల్యాణ్, నాగబాబుకు ఓట్లేయడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదని స్పష్టం చేశారు. పవన్ కు అసలు ఓటెందుకు వేయాలని పాల్ ప్రశ్నించారు. మాయావతి కాళ్లు మొక్కాడని పవన్ కు ఓటేయాలా? అంటూ పాల్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్, నాగబాబు లాంటి వాళ్లు రీల్ హీరోలు.. కానీ నేను మాత్రం రియల్ హీరోను, ప్రపంచానికే హీరోను.. అంటూ పాల్ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. తాను ఎలా రియల్ హీరోనే కూడా చెప్పారు.

ఏడు యుద్ధాలు ఆపా..

ఇప్పటికి నేను ఏడు యుద్ధాలు ఆపాను. నిజం చెప్పాలంటే నేను చాలా సహజంగా డ్యాన్స్ చేస్తా. వాళ్ల కంటే కూడా బాగా వేస్తా. రమ్మని చెప్పండి. డ్యాన్స్ కానీ.. రన్నింగ్ కానీ.. డిబేట్ కానీ.. దేనికైనా నేను సిద్ధం.. డబ్బు తీసుకురావడానికి, సంపాదించడానికి, ఏ పని చేయడానికి కూడా వాళ్లు నాతో పోటీపడలేరు. అసలు వాళ్లు ఏం చేయగలరు.. అంటూ కేఏపాల్.. పవన్ కల్యాణ్, నాగబాబుపై విరుచుకుపడ్డారు.