క్లాస్ బోర్ కొట్టింది.. క్లాస్‌రూంలోనే నిద్రపోయింది.. !

-

అబ్బబ్బబ్బ… ఏం చదువులో ఏమో.. పుట్టినప్పటి దగ్గర్నుంచి ఓ 20-25 ఏండ్లు చదవడమే. ఎవడు కనిపెట్టాడురా బాబు ఈ చదువులు అని అనిపిస్తుంటుంది కదా ఒక్కోసారి. సేమ్ ఈ పాపకు కూడా అదే అనిపించినట్టుంది. అందుకే ఏం చక్కా క్లాస్ రూంలోనే బజ్జొంది. ఎంత ముద్దుగా నిద్రపోతుంది కదా. క్లాస్ రూంలో నిద్రపోతున్న ఈ చిన్నారిని లేపడానికి క్లాస్ టీచర్ ఎంత ప్రయత్నించినా అస్సలు లేవలేదట. దీంతో నిద్రపోతున్న ఆ బుజ్జి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పక్కన ఉన్న తన క్లాస్‌మేట్ లేపినా అస్సలు నిద్ర మత్తు వదల్లేదు ఆ చిన్నారికి. ఇక.. ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చింది. అంతే.. వాళ్లు ఆ వీడియోను వైరల్ చేసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news