ఇరాక్‌లో క్రీస్తు పూర్వం 2వేల ఏళ్ల కింద‌టి శ్రీ‌రాముని పాద‌ముద్ర‌లు ల‌భ్యం..!

-

ఇరాక్‌లో ఇటీవ‌లే భార‌తీయ పురావ‌స్తు శాఖ ప్ర‌తినిధులు ప‌ర్య‌టించ‌గా.. అక్క‌డి ఓ ప్రాంతంలో శ్రీ‌రాముని పాద‌ముద్ర‌లు వారికి క‌నిపించాయి. ఆ ముద్ర‌లు క్రీస్తు పూర్వం 2వేల సంవ‌త్స‌రానికంటే ముందువ‌ని పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

హిందూ పురాణాల గురించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు మ‌న‌కు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటాయి. అలాగే అల‌నాటి చ‌రిత్ర‌కు సంబంధించిన సాక్ష్యాలు కూడా అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట ప‌డుతుంటాయి. శ్రీ‌లంక‌లో రాముడు, రావ‌ణుడు తిరిగిన ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని మ‌న‌కు ఒక‌ప్పుడు తెలిసింది. ఇప్పుడు ఇరాక్‌లో శ్రీ‌రాముడు, ఆంజనేయ స్వామి తాలూకు ఆన‌వాళ్లు తాజాగా బ‌య‌ట ప‌డ్డాయి.

ఇరాక్‌లో ఇటీవ‌లే భార‌తీయ పురావ‌స్తు శాఖ ప్ర‌తినిధులు ప‌ర్య‌టించ‌గా.. అక్క‌డి ఓ ప్రాంతంలో శ్రీ‌రాముని పాద‌ముద్ర‌లు వారికి క‌నిపించాయి. ఆ ముద్ర‌లు క్రీస్తు పూర్వం 2వేల సంవ‌త్స‌రానికంటే ముందువ‌ని పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇరాక్‌లోని ఓ కొండ శిఖ‌రంపై ఆ ముద్ర‌ల‌ను చెక్కార‌ని పురావ‌స్తు శాఖ తెలిపింది. ఆ ముద్ర‌లు అచ్చం అయోధ్య షౌధ్ సంస్థాన్ ప్ర‌తిరూపంలో ఉండ‌డం విశేషం.

ఇరాక్‌లోని హ‌రోన్ షేఖాన్ ప్రాంతంలో భార‌తీయ పురావస్తు శాఖ బృందం ప‌ర్య‌టిస్తుండ‌గా వారికి ద‌ర్భాండ్ ఈ బెల్యులా అనే ఎత్తైన కొండ శిఖ‌రంపై శ్రీ‌రాముని ప్ర‌తిరూపం క‌నిపించింది. దీంతో వారు ఆశ్య‌ర్యానికి లోన‌య్యారు. ఆ శిఖ‌రంపై చెక్క‌బ‌డిన రూపంలో శ్రీ‌రాముడు బాణం ప‌ట్టుకుని ఉండ‌గా, ఆయ‌న వెనుక బాణాలు ధ‌రించే అమ్ముల‌పొది ఉంది. ఇక ఆయ‌న న‌డుంకు చిన్న క‌త్తి ఉంది. అలాగే రాముడి ఎదుట మ‌రో ప్ర‌తిమ కూడా చెక్క‌బ‌డి ఉంది. అది అచ్చం హ‌నుమంతున్ని పోలి ఉంది. కాగా స‌ద‌రు శిఖ‌రంపై చెక్క‌బ‌డి ఉన్న ఆ ప్ర‌తిమ‌ల‌ను ఇరాకీలు తర్దున్నీ అని పిలుస్తుంటారు.

ఇక ఇదే శిఖ‌రంపై రాగి రేకుతో చేసిన అచ్చుల వంటి ఎన్నో ప్ర‌తిమ‌లు ఉన్నాయి. అయితే రాముని ప్ర‌తిరూపాన్ని ఇరాక్‌లో కొండ‌ల‌పై ఎందుకు చెక్కారు, అందుకు ఉన్న కార‌ణాలు ఏమిటి ? అన్న విష‌యాలు ఇంకా తెలియ‌లేదు. దీంతో ప్ర‌స్తుతం భార‌తీయ పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు ఆ విష‌యాల‌ను మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు. కొన్ని వేల యుగాల కింద‌టి శ్రీ‌రాముని చ‌రిత్ర ఇక్క‌డి వారికి ఎలా తెలిసి ఉంటుందా ? అన్న కోణంలోనూ వారు అధ్య‌య‌నం చేస్తున్నారు. అయితే ఇవే కాదు, ప్ర‌పంచంలోని ప‌లు ఇత‌ర ప్ర‌దేశాల్లోనూ శ్రీ‌రాముడికి చెందిన ఆన‌వాళ్ల‌ను కూడా సేక‌రించాక‌.. అన్నింటినీ ఒకే ద‌గ్గ‌ర ఉంచి మ‌రింత అధ్య‌య‌నం చేస్తామ‌ని కూడా వారు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇప్పుడీ విష‌యం మాత్రం ఎంతో మందికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది..!

Read more RELATED
Recommended to you

Latest news